Begin typing your search above and press return to search.

రేవంత్ 'ఆమ్మవారు..క‌మ్మవారు' పంచ్ అదిరిందిగా?

By:  Tupaki Desk   |   28 Jun 2018 11:30 AM IST
రేవంత్ ఆమ్మవారు..క‌మ్మవారు పంచ్ అదిరిందిగా?
X
ఏమాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట‌లు మ‌హా ముచ్చ‌ట‌గా ఉంటాయి. ఆయ‌నకున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లే ఆయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ప్ర‌త్య‌ర్థుల మీద తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డే రేవంత్‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీద విరుచుకుప‌డ‌మంటే మ‌హా ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. గ‌డిచిన కొంత‌కాలంగా సైలెంట్ గా ఉంటున్న రేవంత్ రెడ్డి.. తాజాగా కేసీఆర్ బెజ‌వాడ ప్ర‌యాణంపై త‌న‌దైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

నాలుగేళ్లుగా గుర్తుకు రాని విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌.. ఇప్పుడే గుర్తుకు వ‌చ్చిందా? అంటూ సూటిగా ప్ర‌శ్నించిన ఆయ‌న ఎన్నిక‌ల వేళ కొంత‌మందిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌టం కోస‌మే కేసీఆర్ విజ‌య‌వాడ వెళుతున్న‌ట్లుగా చెప్పారు. పేరుకు మొక్కు చెల్లించుకోవ‌టం అని చెప్పినా అది నిజం కాద‌న్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మొక్కులు గుర్తుకు వ‌స్తాయా? అంటూ వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు.

ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తున్న నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ గుట్ట మీద అమ్మ‌వారు.. గుట్ట కింద ఉన్న క‌మ్మ‌వారు కేసీఆర్‌కు గుర్తుకు వ‌స్తుంద‌ని పంచ్ విసిరారు. కేసీఆర్ మొక్కుసంగ‌తి ఎలా ఉన్నా.. ఆ సంద‌ర్భంగా మాంచి రైమింగ్ లో అదిరేలా ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్య ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారింద‌ని చెప్పాలి.