Begin typing your search above and press return to search.

లోకేష్ భవిష్యత్ పై రేవంత్ రెడ్డి-రాధాకృష్ణ చర్చ

By:  Tupaki Desk   |   4 July 2021 4:49 AM GMT
లోకేష్ భవిష్యత్ పై రేవంత్ రెడ్డి-రాధాకృష్ణ చర్చ
X
తెలంగాణ పీసీసీ చీఫ్ గా అయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లను, మేధావులను, ప్రముఖులను కలుస్తూ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ మీడియా అధినేత అయిన, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల ఎండీ రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రేవంత్ రెడ్డి మెడలో కాంగ్రెస్ కండువా ఉండడంతో ఇది తాజా వీడియోనే అని అర్థమవుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, పీసీసీ చీఫ్ మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియోను బట్టి అర్థమవుతోంది. మొదట వీరు టీడీపీ నేత నారా లోకేష్ గురించి మాట్లాడుకున్నారు.. ‘లోకేష్ కోసం తాను ఎంత తిరిగానో తెలుసా?’ అని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. దానికి రేవంత్ రెడ్డి బదులిస్తూ ‘గట్టిగా తిప్పమనండి అన్న.. నిజంగా’ అంటూ తెలిపారు.

ఇక తెలంగాణలో నీకు కవరేజ్ రాదంటూ రాధాకృష్ణ... రేవంత్ రెడ్డితో పంచుకున్నారు. ‘తెలంగాణలో పరిస్థితి ఏమైందంటే.. ఆంధ్రజ్యోతి, టీవీ5, మీడియా అంతా ఇక్కడ కేసీఆర్ కంట్రోల్ లోనే ఉంది. మిగతా వాళ్లెవరూ నీకు కవరేజ్ ఇవ్వట్లేదు.ఇక ఏపీలో ఆంధ్రజ్యోతి, టీవీ5 తప్ప ఎవరూ లోకేష్ ను వదల్లేదు.. దాన్ని కొంత కంట్రోల్ చేశాం’ అని రాధాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

దీనికి రేవంత్ రెడ్డి సైతం పలు సూచనలు చేశారు. లోకేష్ ను ఎంత గ్రౌండ్ లో తిరిగితే అంత ప్రజల్లో ఫేమ్ అవుతాడని సలహా ఇచ్చాడు.

లోకేష్ తో ఎక్కువ నేను మాట్లాడలేదని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.. అవును ఈ విషయం నన్ను కూడా అడిగావని రేవంత్ రెడ్డి బదులిచ్చాడు.

ఇలా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రాబల్యం.. ఏపీలో లోకేష్ శక్తి సామర్థ్యాల గురించి రాధాకృష్ణ-రేవంత్ రెడ్డి పర్సనల్ గా మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక ఆయనను కలిసి ఉండొచ్చని.. వారి మధ్యన జరిగిన సంభాషణను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టారని అర్థమవుతోంది. అది నిజమా కాదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. దీనిపై నిజనిజాలు తేలాల్సి ఉంది.