Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: ఈయన రేవంత్ రెడ్డినా?

By:  Tupaki Desk   |   29 April 2019 10:38 AM IST
ఫొటోస్టోరీ: ఈయన రేవంత్ రెడ్డినా?
X
ఎన్నికలు రాగానే కాలికి బలపం కట్టుకొని తిరగడం.. జనాలకు చేరువవుడం.. చేమటోడ్చడం చేస్తుంటారు రాజకీయ నేతలు.. ఎన్నికలు అయిపోయాగానే సేదతీరేందుకు వెళుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలోనే ఎన్నికలు ముగియడం.. ఫలితాలకు నెలన్నర సమయం ఉండడంతో అందరూ హాలీడేస్ తీసుకొని టూర్లకు వెళుతున్నారు. జగన్, చంద్రబాబు సహా అందరూ ఒకటి రోజు రెండు రోజులైనా సరే హాలీడేస్ కు వెళ్లొచ్చారు..

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు.. ప్రస్తుతం రేవంత్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ ఫొటో చూస్తే రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా చెలరేగి పోయే రేవంత్ రెడ్డియేనా అనే అనుమానం రాకమానదు. రాజకీయాల నుంచి తాత్కాలికంగా సెలవు తీసుకోని ఓ కొండ అంచున నీటి తీరువా పక్కన అందాలను తన కెమెరాలో బంధిస్తున్న రేవంత్ చిత్రం ఆహ్లాదకరంగా ఉంది. అతడి పొలిటికల్ కెరీర్ కు ఇంత స్వాంతన ఇంకెప్పుడు దొరకదేమో అన్నట్టుగా రేవంత్ ఆస్వాదిస్తున్నట్టుంది. ఎన్నికలకు ఇంకా 25 రోజులు ఉన్న నేపథ్యంలో ఈ గ్యాప్ ను రేవంత్ రెడ్డి చక్కగా వినియోగించుకుంటున్నారు.

ఫలితాలు వెలువడ్డాక మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం కామనే. అందుకే ఉన్న ఈకొద్దిరోజులైనా ప్రశాంతంగా గడపడం రాజకీయ నేతగా రేవంత్ కు అవసరం. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశాడు..