Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి పాదయాత్ర పక్కా.. డేట్ అప్పుడేనా?

By:  Tupaki Desk   |   5 Sept 2020 3:40 PM IST
రేవంత్ రెడ్డి పాదయాత్ర పక్కా.. డేట్ అప్పుడేనా?
X
ప్లాన్ ఏ.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడం.. తద్వారా సీఎం సీటును అధిరోహించడం.. ప్లాన్ బి.. తను కాకుంటే తన అనుయాయులు పీసీసీ పీఠంలో కూర్చోవడం.. అయినా కూడా కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చి సీఎం కావడం.. ఇవేవీ కాకుంటే కోదండరాం ద్వారా ప్రజల్లోకి వెళ్లడం.. మొత్తంగా రేవంత్ రెడ్డి టార్గెట్ మాత్రం ఫిక్స్. అదే.. తెలంగాణ సీఎం సీటు.. దానికి ఏదారిలో వెళతాడన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనను బట్టి ఉంటుందని రేవంత్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

తెలంగాణ ఫైర్ బ్రాండ్ అయిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం 2021వరకు ఉంది కాబట్టి.. అప్పటివరకు క్షేత్రస్థాయిలో బూత్ స్థాయిలో ఒక టీంను తయారు చేసుకుంటూ వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ లో ఉన్న సీనియర్స్ ను తన వైపుకు తిప్పుకునే పనిలో పడ్డాడట.

ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి సైన్యం హల్ చల్ చేస్తోంది. కేటీఆర్ టీం రేవంత్ రెడ్డి టీంలు సోషల్ మీడియాలో ధాటిగా విమర్శలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు బీసీల్లో ఉన్న కులాలను విభజించి తన వైపుకు తిప్పుకోవాలనే భిన్నమైన స్ట్రాటజీతో ముందుకెళుతున్నాడట..

ముఖ్యంగా పీసీసీ పీఠమే టార్గెట్ గా రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. రెడ్డిలకు ఇస్తే నాకు, యాదవ్ లకు ఇవ్వాలి అనుకుంటే అంజన్ కుమార్ యాదవ్ కు.. ఎస్సీలకు ఇస్తే కొన్ని పేర్లు.. గౌడ్స్ లలో కొన్ని పేర్లు ఇచ్చి అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ దెబ్బతో బీసీల్లో పట్టు ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావును ఏకాకిగా చేశాడని అంటున్నారు. ఈ పరిణామాలతోనే 3 నెలల ముందు రెడ్డిల్లో కోమటిరెడ్డి బ్రందర్స్ కు ఎందుకో కొంచెం ఊపు తగ్గిందని.. అది కూడా రేవంత్ రెడ్డి కలిసివస్తోందని అంటున్నారు.

ఒకవేళ పీసీసీ ఇవ్వకపోతే కోదండరాంతో ఒక వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నాడట.. పాదయాత్రకు ప్లాన్ చేశాడని అంటున్నారు. ప్రజలతోనే మమేకం కావడానికి 2021 మధ్యలో కార్యాచరణ రూపొందిస్తున్నాడని రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ చెబుతున్నారు.. రేవంత్ రెడ్డి ప్రణాళికల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఇంటి బయటా ఒకటే చర్చ జరుగుతోంది.