Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డి పాదయాత్ర జోరు: చేవేళ్ల నుంచి షురూ..
By: Tupaki Desk | 18 Dec 2021 2:49 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు పీసీసీ చీఫ్ పోరుబాట సాగించనుననారు. పలు జిల్లాల్లో పాదయాత్రలు చేపట్టి ప్రజలు ఆకర్షించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
జాతీయ కాంగ్రెస్ ను పటిష్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాందీ, ప్రియాంకలు పాదయాత్ర చేపడుతుండగా వారికి సంఘీభావంగా తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింట్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టనున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే చేవెళ్లలో పాదయాత్ర చేపడుతుండగా.. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేయనున్నారు.
నిత్యావసరాల ధరల పెరుగుతలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. వారికి అనుగుణంగా పోరాటం చేయడానికి కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా జాతీయంగా, ప్రాంతీయంగా పార్టీని అభివృద్ధి చేసే దిశగా నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కలవనున్నారు. చేవేళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర జరగనుంది.
ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక ఖమ్మంలో మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాల్గొననున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ కూడా తెలంగాణ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించనున్నారు. అలాగే జనవరి 30 నుంచి 15 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు. ఇందులో ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ కలిసి వీరితో కలిసి సాగనున్నారు.
ఇదిలా ఉండగా పార్టీ కేడర్ పెంచుకునేందుకు నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు డిజిటల్ మెంబర్ షిప్ ను ప్రవేశపెట్టారు. సుమారు 30 లక్షల సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
కేసీఆర్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుందని, పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. నిధులు మంజూరు చేయకపోవడంతో పంచాయతీలు నిర్వీర్యమైపోతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లోకాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఇందులకు ప్రతీ కార్యకర్త తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే కార్యకర్తలో ఉన్న నైరాశ్యాన్ని తొలగించేదుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఏమాత్రం గ్యాప్ లేకుండా రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలతో పార్టీని గాడిలో పడేసేందుకు యత్నిస్తున్నారు. అయితే పాదయాత్రతో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని యత్నిస్తున్నారు. అయితే అందరూ ఒకే చోట కాకుండా నాయకులు విభజన అయి పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు.