Begin typing your search above and press return to search.

దక్షిణాది పవర్.. కేంద్రం వెనక్కి..

By:  Tupaki Desk   |   4 Jun 2019 1:28 PM IST
దక్షిణాది పవర్.. కేంద్రం వెనక్కి..
X
దేశంలో సగం మంది మాట్లాడే భాష హిందీ..కానీ దక్షిణాదిన మాత్రం ద్రవిడ భాషలదే ఆదిపత్యం.. కర్ణాటకలో కన్నడ, ఏపీ,తెలంగాణలో తెలుగు, తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం.. తమ మాతృభాషలుగా వాడుతున్నారు. అయితే కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ సర్కారు జాతీయ భాష అయిన హిందీని దేశమొత్తం రుద్దాలని చూసింది. అదే ఇప్పుడు నిరసన జ్వాలలకు వేదికైంది..

దేశంలో రెండోసారి అధికారంలోకి చేపట్టిన బీజేపీ.. దేశంలో విద్యా సంస్కరణలకు నడుం బిగించింది. దేశంలోని హిందీ రాష్ట్రాలతోపాటు హిందీయేతర రాష్ట్రాలలో హిందీని తప్పనిసరి భోధన భాషగా చేర్చాలన్న కమిషన్ నివేదికను అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. పాఠశాలల్లో ప్రాంతీయ భాష , ఇంగ్లీష్ తోపాటు హిందీని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించింది. దీనికి దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు తెలంగాణ నేతలు నిరసనలు తెలిపారు. కేంద్రం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని ఆరోపించారు. తమిళనాట నిరసనలు జరిగాయి.. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ హిందీని తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా డీఎంకే ర్యాలీలు కూడా తీసింది. అన్నాడీఎంకే కూడా వ్యతిరేకించినా బీజేపీతో దోస్తానా కారణంగా నిరసన తెలుపలేదు. ఇక మహారాష్ట్రలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేరళ ప్రభుత్వం, ప్రజలు, నాయకులు కూడా నిరసన తెలిపారు. కన్నడ పీసీసీ ప్రెసిడెంట్ సిద్ధరామయ్య అయితే ఇది కేంద్రం ఆధిపత్య క్రూరచర్యగా అభివర్ణించారు. దీన్ని అమలు కానివ్వమని తేల్చిచెప్పారు. తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా తెలుగును నిర్భంద విద్యను దేశంలో చేయగలరా అని ప్రశ్నించారు.

దీంతో కేంద్రం వెనక్కితగ్గింది. ముసాయిదా విధానంలో మార్పులు తెచ్చింది. మూడు భాషల్లో మార్పులు చేసుకోవడానికి అనుమతిచ్చింది.