Begin typing your search above and press return to search.

హరీశ్ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఏకేసిన ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   16 Oct 2020 11:00 AM IST
హరీశ్ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఏకేసిన ఫైర్ బ్రాండ్
X
అందునా..ఒక ప్రముఖ అధినేత నోటి నుంచి తరచూ వచ్చే మాట.. దాన్ని ప్రజలు.. పార్టీలు ఒక రేంజ్లో విరుచుకుపడిన తర్వాత.. ఆ మాటను అదే పనిగా వల్లించటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తాను ఏమాటను పట్టుకొని అదే పనిగా ఏకేశారో.. అదే మాట ఇప్పుడాయన నోట రావటం సరికాదంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటారా? అక్కడికే వస్తున్నాం.

తెలంగాణ లో తాజాగా జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం మహా జోరుగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికను పర్సనల్ గా తీసుకున్న మంత్రి హరీశ్ రావు.. అంతా తానై అన్నట్లుగా నడిపిస్తున్నారు. నిత్యం పొద్దున మొదలు పెడుతున్న ప్రచారం రాత్రి పొద్దుపోయే వరకుసాగిస్తున్నారు. అనంతరం రివ్యూలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో దుబ్బాక ఓటర్ల మనసు దోచుకునేందుకు ఆయన ప్రస్తావిస్తున్న రెండు కళ్ల కాన్సెప్టు ఇప్పుడు చర్చగా మారింది.

సరిగ్గా అదే పాయింట్ పట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కమ్ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. హరీశ్ ను ఏకి పారేస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు సిద్దిపేట.. దుబ్బాక రెండు కళ్లు అని అదే పనిగా హరీశ్ అంటున్నారని.. అదే నిజమైతే.. సిద్ధిపేట మాదిరి దుబ్బాక ఎందుకు డెవలప్ కాలేదని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. నాలుగుసార్లు గెలిచిన సోలిపేట అంత గొప్ప నేత అయినప్పుడు ఆయన్ను మంత్రి వర్గం లోకి ఎందుకు తీసుకో లేదని ప్రశ్నిస్తున్నారు. అయినా.. రెండు కళ్ల సిద్ధాంతం అంటేచంద్రబాబును ఎగతాళి చేయటం.. తీవ్రంగావిరుచుకు పడిన వారిలో హరీశ్ ఒకరు. మరి.. ఆ సబ్జెక్టు ను ముట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనాతన ప్రచార తీరు ను హరీశ్ మార్చుకుంటారో లేదో?