Begin typing your search above and press return to search.

జైల్లో రేవంత్ రెడ్డి అలా చేశారా?

By:  Tupaki Desk   |   28 Jun 2015 4:06 PM IST
జైల్లో రేవంత్ రెడ్డి అలా చేశారా?
X
ఓటుకు నోటు కేసులో నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం పిటిషన్ లు వేస్తున్నప్పటికీ విచారణలో ఉండటం వల్ల ఆయనకు కారాగారం నుంచి బయటకు వచ్చే అవకాశం దొరకడం లేదు. అయితే రిచ్ లైఫ్ కు, ఉత్సాహంగా ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి జైల్లోనూ అదే విధంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టులో శుక్రవారం వాదనలు నడిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. ఈ విషయం తెలిసినప్పటికీ రేవంత్ రెడ్డి పెద్దగా నిరాశ పడలేదని సమాచారం. జైల్లో ఉన్న తోటి ఖైదీలకు, సిబ్బంది జైల్లోనే ఇఫ్తార్ విందు ఇచ్చారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.

శుక్రవారం బెయిల్ పిటిషన్ వాయిదా పడటం ఊహించిన పరిణామంగానే భావించిన రేవంత్ రెడ్డి ....అదే రోజు రోజాలో ఉన్న ముస్లింలకు పవిత్ర శుక్రవారం దినం కావడంతో.... ఇఫ్తార్ విందు ఇచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. మొత్తంగా తన ప్రత్యేకతను జైల్లో కూడా చాటుకున్న వ్యక్తిగా రేవంత్ రెడ్డి నిలిచారు.