Begin typing your search above and press return to search.

రేవంత్ ఈజ్ బ్యాక్.. తాజా ప్రెస్ మీట్ తో దుమ్ము దులిపేశారు

By:  Tupaki Desk   |   27 Dec 2021 10:08 AM IST
రేవంత్ ఈజ్ బ్యాక్.. తాజా ప్రెస్ మీట్ తో దుమ్ము దులిపేశారు
X
రేసులో వెనుకబడిపోయినట్లుగా పలువురి నోట మాటలు వినిపిస్తున్నా.. గమ్మున ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కమ్ రథసారధి రేవంత్ రెడ్డి తాజా సంచలనంగా మారారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం.. ధాన్యం కొనుగోలు ఎపిసోడ్ తో రాష్ట్రంలో తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారిపోవటం.. గడిచిన కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్యనే రాజకీయం నడుస్తుండటం.. కాంగ్రెస్ ఎక్కడా కనిపించకపోవటం తెలిసిందే. గడిచిన కొంతకాలంగా పెద్దగా రియాక్టు కాని రేవంత్ రెడ్డి.. తాజాగా మాత్రం గురి చూసి కొట్టినట్లుగా వ్యవహరించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లోపాల్ని ఎత్తి చూపుతానని చెప్పే బీజేపీ రథసారధి బండి సంజయ్ హెచ్చరికలకు భిన్నంగా.. ఎలాంటి సౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి బాక్సు బద్ధలయ్యేలా రేవంత్ వ్యవహరించారని చెప్పాలి. తెలంగాణ రైతులు వరి వేయొద్దని.. వరి వేస్తే ఊరేనని.. రైతబంధు పథకం అమలు చేయం.. ఇలా ఎన్నో వ్యాఖ్యలు రావటం తెలిసిందే. ఈ మాటలకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో ఈ యాసంగికి వరి పండిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఉత్త మాటలతో పని కాదన్న విషయం సీనియర్ నేతైన రేవంత్ కు తెలియంది కాదు. అందుకే ఆయన ఫాం హౌస్ లో పండిస్తున్న వరి పంటను సాగు చేస్తున్న ఫోటోలను మీడియాకు అందజేశారు. అంతేకాదు.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సాగు చేస్తున్న వరిని చూపిస్తానని చెప్పారు. ఇలా.. సంచలన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి తీరును చూసినోళ్లంతా ఫైర్ బ్రాండ్ ఈజ్ బ్యాక్ అన్న మాటలు వినిపిస్తోంది.

కామ్ గా ఉంటే ఉండొచ్చు కానీ.. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడేలా రేవంత్ రివీల్ చేసిన అంశం ఉందని చెబుతున్నారు. తాజా ఉదంతం మరిన్ని రోజులు రాజకీయ రగడకు కారణమవుతుందని చెప్పక తప్పదు. గడిచిన కొంతకాలంగా పెద్దగా సందడి లేకుండా ఉన్న రేవంత్ మౌనం ఇంతటి సంచలనాన్ని రేకెత్తిస్తుందన్న అంచనా లేదనే చెప్పాలి.