Begin typing your search above and press return to search.
రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా ఖాయమా?
By: Tupaki Desk | 15 Dec 2020 9:08 PM ISTకాంగ్రెస్ కథ తెలంగాణలో కంచికి చేరుతోంది. బీజేపీ బలపడుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను తోసిరాజని ఆ స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ క్రమం కాంగ్రెస్ అధిష్టానం కూడా అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది.
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దారుణ పరాభావంతో టీపీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని టీకాంగ్రెస్ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ పదవిపై కాంగ్రెస్ సీనియర్లు అంతా ఇప్పటికీ ఫుల్ లాబీయింగ్ మొదలుపెట్టారు. మీడియా ముఖంగా తమదేనని ప్రకటించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కొద్దిరోజులు హైదరాబాద్లోనే మకాం వేసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తంగా 200మంది కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి ఠాకూర్ విన్నవించినట్లు సమాచారం.వీటిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీ పదవీ తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా తాజా పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్‌తో పాటు రేవంత్ పాల్గొనబోతున్నారు.
రాహుల్ తో రేవంత్ భేటి కానుండటంతో టీపీసీసీ పదవీ రేవంత్ కే దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రేపటిలోగా టీపీసీసీ పదవీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.