Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ ను కెలికేందుకే..రేవంత్ ఈ మాట వాడారా?
By: Tupaki Desk | 15 Nov 2018 1:27 AM ISTటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ - కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మరోమారు కలకలం రేపే కామెంట్లు చేశారు. ఇటీవలి కాలంలో తన కోర్టు కేసులు - కాంగ్రెస్ లో తనతో పాటుగా చేరిన నాయకులకు టికెట్ల విషయంలో బిజీ బిజీ అయిపోయిన రేవంత్ రెడ్డి ఒకింత గ్యాప్ తో కలకలం రేపే కామెంట్లతో మీడియాతో ముందుకు వచ్చారు. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. టీఆర్ ఎస్ కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని - కేసీఆర్ కు చేతనైతే అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలను ఆపుకోమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తన ఇలాకా అయిన కొడంగల్ నుంచి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
తాను కొడంగల్ నుంచి గెలవడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఏనాడూ తాను కొండగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని.. ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని వివరించారు. కొడంగల్ లో తనపై కేసీఆర్ పై పోటీ చేసినా - తానే గెలుస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ కు సూచించారు. కాగా, నిజంగానే ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా? అధికార టీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆ ఇద్దరు నేతలు ఎవరు? రేవంత్ జోస్యం చెప్పాడా లేదా ఓ రాయి వేశాడా? అనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.