Begin typing your search above and press return to search.
మంత్రి కేటీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 8 Jun 2020 8:30 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేసిన విమర్శలపై స్పందించారు.
మంత్రి కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ కట్టారని.. ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా దీన్ని కేటీఆర్ లీజుకు తీసుకున్నారని.. సమావేశాలు ఏర్పాటుకు.. కుటుంబ సభ్యులతో ఉండడానికి దీన్ని వాడుకుంటున్నారని సుమనే చెప్పాడని రేవంత్ పేర్కొన్నారు. స్వయంగా ఎమ్మెల్యే సుమన్, పోలీసులు ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ దేనని ఒప్పుకున్నారని రేవంత్ ఆరోపించారు.
కేటీఆర్ కు జన్వాడ దగ్గర తనకు ఆస్తులు లేవు అన్నారని.. ఆయన సతీమణీ పేరు మీద భూములు ఉన్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు. 2019 మార్చిలో ఓ సేల్ డీడ్ జరిగిందని.. ఇది కల్వకుంట్ల శైలిమ, వైఫ్ ఆఫ్ కేటీఆర్ అని పేరు మీద ఉందన్నారు. 301 సర్వే నంబర్ లో 2 ఎకరాల 2 గుంటలు సేల్ డీడ్ ఉందన్నారు. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో 2కోట్ల 70 లక్షల విలువ చేసే అర్బనా అవెంచర్స్ పేరు మీద భూమి ఉందని తెలిపారన్నారు. భూములు ఉన్నా కేటీఆర్ ప్రస్తుతం బుకాయించాలని చూస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
మంత్రిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ఎందుకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్, ఆయన సతీమణిపై ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని.. కేటీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం తప్పు ఉన్నా ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు.