Begin typing your search above and press return to search.
క్యాట్ వాక్ లకు మాత్రమే కేటీఆర్ !
By: Tupaki Desk | 28 Sept 2016 4:49 PM ISTటీఆర్ ఎస్ యువనేత - తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ - టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచే రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల జాబితాలో సిరిసిల్ల ఉంటుందని భావించినా... చివరి నిమిషంలో సిరిసిల్ల కనిపించకపోగా - ఏ ఒక్కరూ డిమాండ్ చేయని శంషాబాదు జిల్లా కనిపించింది. ఈ క్రమంలో సిరిసిల్ల ప్రజలు కొత్త జిల్లా కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. సిరిసిల్ల జిల్లా సాధన సమితి పేరిట ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడిన ఆ ప్రాంతంలోని వివిధ వర్గాల ప్రజలు మొన్న రాత్రి ఏకంగా కేటీఆర్ కాన్వాయ్ నే అడ్డుకున్నారు. అంతటితో ఆగని వారు కేటీఆర్ కాన్వాయ్ పై రాళ్లు విసిరారు.
ఈ క్రమంలో నేటి ఉదయం సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి... కాసేపటి క్రితం అక్కడ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. సొంత నియోజకవర్గ ప్రజల మనోభావాలను పట్టించుకోని కేటీఆర్... హైదరాబాదులో జరుగుతున్న ఫ్యాషన్ షోల్లో క్యాట్ వాక్ లతో బిజీబిజీగా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. సొంత నియోజకవర్గ ప్రజల డిమాండ్లను పెడచెవిన పెడుతున్న కేటీఆర్... తెలుగు సినిమీ హీరోయిన్ సమంతా లాంటి వారితో క్యాట్ వాక్ లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాల ఆధారంగా అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్... ఆ ప్రజల డిమాండ్లనే పట్టించుకోకుండా వ్యవహరిస్తుండటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క వర్గం డిమాండ్ చేయని శంషాబాదు జిల్లాను రద్దు చేసి దాని స్థానంలో తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రజల ఆకాంక్షల మేరకు సిరిసిల్ల జిల్లాను చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ల సొంత ప్రయోజనాలను ప్రజల ముందుంచుతామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.