Begin typing your search above and press return to search.
కేసీఆర్ సభపై రేవంత్ క్రేజీ కామెంట్
By: Tupaki Desk | 22 Aug 2018 7:38 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుంటే...మరోవైపు ఆయన ఎత్తుగడలపై ఆదిలోనే నీళ్లు చల్లారు గులాబీ దళపతిని జీవితాంతం ప్రత్యర్థిగా భావించే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ముందస్తు ప్రచారం నేపథ్యంలో అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తే అంతకు ఓ గంట ముందే...రేవంత్ విలేకరుల సమావేశం నిర్వహించి విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ఎత్తుగడలన్నీ కాంగ్రెస్ లక్ష్యంగా సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ పర్యటన ప్రాధాన్యత తగ్గించేందుకు,మీడియా కవరేజ్ తగ్గించేందుకు కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టాడు, అయినా రాహుల్ పర్యటన విజయవంతం అయ్యిందని ఈ నేపథ్యంలో మరో ఎత్తుగడకు తెరలేపారన్నారు.
సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ పెడతానని కేసీఆర్ చెప్పాడని, అయితే అది సాధ్యం కాదని నిఘావర్గాలు నివేదిక ఇచ్చాయని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని సీఎం కు అందిన నివేదికలో ఉందన్నారు. ``ఆగస్టు 15 కల్లా ఇంటింటి నల్లా నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పాడు. లేకుంటే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పాడు. కానీ ఇంతవరకు ఆ హామీ ఏమైంది? ఈ డిసెంబర్ వరకు కూడా కేసీఆర్ ఆ హామీని నెరవేర్చలేదు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలే .. ప్రతి నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ అన్నాడు పెట్టలేదు. ఇవే కాదు చేస్తానన్న ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేక పోయాడు. కేసీఆర్ కు చేతనైతే ముందుగా ప్రకటించిన విధంగా ప్రగతి నివేదన సభ పెట్టాలి. ప్రగతి నివేదన సభ పెడితే ఇచ్చిన హామీలపై నేను బహిరంగ చర్చకు నేను సిద్ధం`` అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకు - పార్టీలో తిరుగుబాటు నుంచి బయటపడేందుకు .. ముందస్తు ఎన్నికలనే నాటకం ఆడుతున్నాడని రేవంత్ ఆరోపించారు. ఓటర్ లిస్ట్ వచ్చే జనవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ రాశారని, ఓటర్ లిస్ట్ పూర్తి కాకుండా ఎలా ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తారని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులు ముందస్తు ప్రిపరేషన్స్ పక్కన పెట్టి సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని కోరారు. అసెంబ్లీలో ఎంఐఎంతో కలిసి వెళ్లాలని ..దాని తరువాత ఎంఐఎంకు పక్కన పెట్టి బీజేపీతో కలిసి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ చూస్తున్నారని రేవంత్ విశ్లేషించారు. ఎంఐఎం కూడా బీజేపీతో దోస్తీపై ఆలోచించాలన్నారు. జమిలీ ఎన్నికలంటున్న మోడీ .. అసెంబ్లీ కి ముందస్తు ఎన్నికలకు ఎలా సహకరిస్తారని రేవంత్ ప్రశ్నించారు. అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలు వేరు వేరుగా పెట్టడం వల్ల ఆర్థిక భారం పడుతుందని, కేసీఆర్ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ సహకరిస్తే .. అది లోపాయకారి ఒప్పందమే అవుతుందని రేవంత్ అన్నారు. పార్టీ క్యాడర్‌ను అప్రమత్తం చేసేందుకు మాత్రమే పీసీసీ చీఫ్ ముందస్తు ఎన్నికలంటున్నాడని, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే పీసీసీ అధ్యక్షుగా ఉత్తమ్ పార్టీని సమాయత్తం చేస్తున్నాడని రేవంత్ చెప్పారు. బీజేపీతో కలిసేవాళ్లను, లోపాయకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు తమకు శత్రువులేనని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు చెప్పాడని, చంద్రబాబు మాటల ప్రకారం తెలంగాణలో టీఆర్ ఎస్ వారికి శత్రువుని తేలిపోయిందని, ఇక మిత్రులెవరన్నది తెలదానికి ఇంకా సమయం పడుతుందన్నారు.