Begin typing your search above and press return to search.

అంత మాట రేవంత్ అన్నది ఎవరిని?

By:  Tupaki Desk   |   27 March 2017 2:05 PM GMT
అంత మాట రేవంత్ అన్నది ఎవరిని?
X
ఎదుటోళ్ల మీద ప్రయోగించింది.. మనకే రివర్స్ కొడితే దాన్ని బూమరాంగ్ అనటం తెలిసిందే. తెలిసి చేశారో..తెలియక చేశారో కానీ.. రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న ఒక ట్వీట్ వ్యాఖ్య సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. కొందరు దీన్ని సాకుగా చేసుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నోరార తిట్టిపోస్తుంటే.. మరికొందరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఇంకొందరు రేవంత్ చేసిన ట్వీట్ ఏ ఉద్దశంతో చేశాడో తెలుసా? అంటూ కొత్త యాంగిల్ చెబుతూ ఇష్యూకు మరింత మసాలా దట్టిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. రేవంత్ ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో కానీ.. ఆ ఉద్దేశం ఎంత వరకూ నెరవేరిందో కానీ.. సొంత అధినేత వైపు వేలు ఎత్తిచూపే అవకాశం ఇచ్చినట్లుగా ఉందన్నది మాత్రం నిజం. ఆయనే ఉద్దేశంతో చేసినా..అది కాస్తా చంద్రబాబును అనేందుకు పూర్తి అవకాశం ఇచ్చేలా ట్వీట్ ఉండటం గమనార్హం. ఇంతకీ రేవంత్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ లో ఏముందన్నది చూస్తే..

‘‘పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు వ్యభిచారులు.. వాళ్లని చేర్చుకునేది ఆ వ్యభిచార కొంపలు నడిపే యజమానులు’’ అంటూ మాంచి మసాలా దట్టించినట్లుగా ఉన్న వ్యాఖ్య చేశారు. ఇంత ఘాటుగా వ్యాఖ్య చేసిన పెద్దమనిషి.. పనిలో పనిగా తాను ఎవరిని టార్గెట్ చేసిందన్నది మరికాస్త కార్లిటీ ఇచ్చేస్తే ఏ గొడవా ఉండేది కాదు. ఎందుకంటే.. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేల్ని పవర్ లో ఉన్న పార్టీలు కలుపుకోవటం ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తమ పార్టీ అధినేత ఏపీలో కూడా కేసీఆర్ తరహాలోనే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించారు. మరి.. రేవంత్ అన్న మాట ఎవరిని ఉద్దేశించిందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

రేవంత్ లాంటి స్వామి భక్తుడు బాబును ఎందుకు అంటారని కొందరు అంటుంటే.. దానేముంది?కడుపులో ఉన్న మంట ఎలానూబయటకు చెప్పలేడు. కనీసం.. ఈ రీతిలో అయినా చెప్పి ఉండొచ్చుగా అన్న మాటను చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఎవరినో అనాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అన్న మాటలు.. చివరకు పార్టీ అధినేతకే తగలటం ఈ ఎపిసోడ్ లో ప్రత్యేకతగా చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/