Begin typing your search above and press return to search.
కేసీఆర్, మోడీ దూకేయాలి.. రేవంత్ హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 23 April 2021 10:57 PM ISTకరోనా విషయంలో హైకోర్టు తిట్లకు సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో దూకాలని.. సుప్రీం తిట్టిన తిట్లకు మోడీ ఎర్రకోట మీద నుంచి దూకాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఇక తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆయన శాఖలోని అధికారులే ఆయన్ను గౌరవించడం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.
కరోనా సెకండ్ వేవ్ వస్తుందని నిపుణులు ఎన్ని సార్లు హెచ్చరించినా ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడం మీద మోడీ దృష్టి నిలిపితే.. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద దృష్టి పెట్టారని రేవంత్ విమర్శించారు.
ఒక డ్రగ్స్ కంపెనీ బ్లాక్ లో మందులు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని.. వారికి కేటీఆర్ కు రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే దానిపై చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ఫైర్ అయ్యారు.
ఇక భారత్ లో తయారైన వ్యాక్సిన్ ను దాయాది పాకిస్తాన్ లో ఉచితంగా వేశారని.. భారత్ లో కూడా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. జాతీయ విపత్తు చట్టం కింద వ్యాక్సిన్, ఆక్సిజన్ ను తయారు చేసే కంపెనీలను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోడీ నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్, వ్యాక్సిన్ దేశంలో అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు.
భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు చేసినా కొరతగానే ఉందని.. వ్యాక్సిన్ ధరను రూ.600 నిర్ణయించడం అంటే ప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను, హాస్పిటల్స్ ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని.. కరోనా వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు.