Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఊరికి రోడ్డు వేసింది ఏవరు?

By:  Tupaki Desk   |   13 Sept 2015 2:42 PM IST
కేసీఆర్ ఊరికి రోడ్డు వేసింది ఏవరు?
X
తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మాటలు ఎంత ఆకట్టుకునేలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోసే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాదిరి ఆకట్టుకునేలా మాట్లాడటం.. మంత్రి హరీశ్ రావు మాదిరి నిర్మాణాత్మకమైన వాదనను వినిపించటం లాంటివి రేవంత్ ప్రసంగంలో కనిపిస్తాయి.

తన రాజకీయ ప్రత్యర్థులపై ఆసక్తికరంగా విమర్శలు చేసే రేవంత్ తాజాగా.. కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరికి రోడ్డు వేసింది ఎవరని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చిన తెలుగుదేశం పార్టీనే.. కేసీఆర్ ఊరికి కూడా రోడ్డు వేసిందని.. టీడీపీ సర్కారు రోడ్డు వేసే వరకూ కేసీఆర్ గ్రామానికి రోడ్డు లేదని చెప్పారు.

గత ప్రభుత్వాలు ఆంధ్రాకు ఎక్కువగా కేటాయింపులు చేపట్టాయని తరచూ మంత్రి హరీశ్ వ్యాఖ్యానిస్తారని.. మరి అలాంటప్పుడు 2004లో వైఎస్ సర్కారులో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్.. వైఎస్ ను ఎందుకు నిలదీయలేదని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. మరి.. రేవంత్ సంధించిన ప్రశ్నలకు కేసీఆర్ అండ్ కో ఏం బదులిస్తారో చూడాలి.