Begin typing your search above and press return to search.

రేవంత్ - జగన్ - మమతా ముగ్గురు ఒకటే పేజ్ నా?

By:  Tupaki Desk   |   19 Feb 2021 5:30 PM IST
రేవంత్ - జగన్ - మమతా ముగ్గురు ఒకటే పేజ్ నా?
X
కాంగ్రెస్ అంటే ఎవరికి వారే యమునా తీరే.. ఆ పార్టీలోని నేతలు అందరూ నాయకులే.. నాయకత్వం వహించేవారే. కలగూర గంపలా కాంగ్రెస్ ఉంటుంది. ఒకరి ఆధిపత్యాన్ని మరొకరు సహించరు. అందుకే ఇప్పుడు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లో ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ కుదేలవుతోంది.

కానీ తెలంగాణ కాంగ్రెస్ లో లీడ్ తీసుకొని ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా పాదయాత్రతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి దూకుడుకు కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకట్ట వేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చినా.. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పీసీసీ పోస్టు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. పార్టీలోని సీనియర్లు ఈయన నిర్వహిస్తున్న పాదయాత్రను పట్టించుకోవడం లేదట. వారు సపోర్టు చేయకపోయినా సరే గానీ.. రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్యంకు ఫిర్యాదులు చేస్తున్నారట. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం దాటి పాదయాత్ర చేస్తున్నారని, వెంటనే ఆయనను ఆపాలని కోరారట. అంతేకాకుండా రావిలాలలో నిర్వహించే బహిరంగ సభకు వెళ్లకూడదని సీనియర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అధ్యక్ష పదవి విషయంలో ఎంతోకాలంగా పార్టీని పట్టుకొని ఉన్న తమకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన అతనికి ప్రాధాన్యం ఇవ్వకూడదని సీనియర్లంతా ఒక్కతాటిపైకి వచ్చినట్లు చర్చ జరిగింది. అంతేకాకుండా ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తే తమను ఎవరూ పట్టించుకోరన్నట్లు వ్యవహరిస్తున్నారట.

ఇక రేవంత్ రెడ్డి మాత్రం సొంతంగా ఎదగాలని పట్టుదలగా ఉన్నారు. నాడు సీఎం పోస్టు ఇవ్వకుంటే ఎలాగైనా జగన్ బయటకు వచ్చాడో నేడు రేవంత్ రెడ్డి సైతం అదే బాటలో ఉన్నాడు. రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ మంత్రి పదవి ఆఫర్ చేసినా.. బీజేపీ పిలిచినా కూడా సీఎం పోస్టు అంతిమలక్ష్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడలేదు.

ఆస్పారిక్ పొలిటిషియన్లుగా జగన్, మోడీ, మమతలను పేర్కొనవచ్చు. వీరంతా ఒకరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. ఎవ్వరు వ్యతిరేకించినా వీరంతా సీఎం, పీఎం సీట్లనే టార్గెట్లుగా పెట్టుకుంటారు. వీరికి లక్ష్యం తప్ప ఇంకోటి పట్టించుకోరు.

అలాంటి ఆస్పారిక్ పొలిటీషియన్ గా రేవంత్ రెడ్డికి పేరుంది. ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. కాంగ్రెస్ సీనియర్లు అంతా అదే కుర్చీ ఫైట్ లో రేవంత్ ను అడ్డుకుంటున్నారు. కానీ ఎవ్వరు అడ్డుకున్నా రేవంత్ మాత్రం ఆ సీఎం సీటు కోసమే ఫైట్ కొనసాగిస్తాడని తెలుస్తోంది.