Begin typing your search above and press return to search.
హిజ్రాల కోసం పార్లమెంట్ లో గళమెత్తిన రేవంత్ ...దేనికోసమంటే !
By: Tupaki Desk | 12 Feb 2020 10:45 AM ISTమనదేశానికి స్వాసంత్రం వచ్చి 73 ఏళ్ళు దాటిపోతున్న కూడా మనదేశంలో ఇంకా కొన్ని బ్రిటిష్ వారు వదిలివెళ్లిన ఆచార వ్యవహారాలనే పాటిస్తున్నాం. ఏళ్లు గడుస్తున్నా కూడా ప్రజల రాతలు మాత్రం మారడంలేదు. ఇంకా కొంతమంది కొందరి కింద దాసులులాగే జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే ఇప్పటికి మన చట్ట సభల్లోఆంగ్లో ఇండియన్స్ కి పెద్ద పీట వేస్తున్నారు. కేవలం ఆంగ్లో ఇండియన్ అనే బ్రిటిషు రక్తం ప్రవహిస్తున్నందుకు గాను, కొందరికి ప్రత్యేకంగా పెద్ద పీటవేసి కూర్చోబెట్టి, మనదేశంలో మన ప్రజల మంచిచెడుల గురించి మన నాయకులు చేసే నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని వారికి ఇస్తున్నాం.
అయితే, స్వాసంత్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇంకా మనకి మన చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ ల ప్రాతినిధ్యం ఇంకా అవసరం ఉందా? అనేదానిపై కొన్నిరోజులుగా చర్చ నడుస్తున్నప్పటికీ దానిపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. అయితే , ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి..పార్లమెంట్ ముందుకి ఒక కొత్త ప్రతిపాదనని తీసుకొనివచ్చారు. అదేమిటి అంటే ..పార్లమెంట్ లో ఆంగ్లో ఇండియన్స్ కి బదులుగా థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రాతినిధ్యం ఉండాలనేది రేవంత్ తాజా డిమాండు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటు లో అసలు ఆంగ్లో ఇండియన్ అనే కోటా ఎందుకు ఉండాలి. ఎలాంటి అర్హతలతోనూ నిమిత్తం లేకుండా ఆంగ్లో అనే పదంతో ముడిపడి ఉన్నారు గనుక.. వారికి చట్టసభల అవకాశం ఎందుకివ్వాలి? అనేది అందరి లో మెదులుతున్న ప్రశ్న.
ఈ సమయం లోనే ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే వారి స్థానంలో థర్డ్ జెండర్ హిజ్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం గురించి కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రజాస్వామ్య దేశంలో చాలా ఏళ్లుగా థర్డ్ జెండర్ వారి పట్ల సుదీర్ఘకాలం పాటు వివక్ష కొనసాగుతూ వచ్చింది.ఆ తరువాత 1994లోనే హిజ్రాలకు ఓటు హక్కు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారు. ఆ తరువాత 1998లో మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్నమ్ మౌసీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా 2003 వరకు పనిచేసింది. ఆ తరువాత నుండి దేశంలో జరిగే ఎన్నికలలో ఎంతోమంది హిజ్రాలు పోటీ చేస్తున్నా కూడా గెలవడంలేదు. ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన బలం ,అనుకూలతలు వారికీ పెద్దగా ఉండవు. కాబట్టి ఏదైనా ఒక చట్టం రూపొందేటప్పుడు మహిళలు , పురుషులు ఎలా తమ వాదనని వినిపిస్తారో ..అలానే హిజ్రాలు కూడా తమ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలి. కనుకనే ఎన్నికల బరిలో నిలిచి గెలవడం కస్టమవుతున్న హిజ్రాలకు ఆంగ్లో ఇండియన్ కోటాకు ముగింపు పలికి , ఆ స్థానంలో వీరికి అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. రేవంత్ రెడ్డి డిమాండ్ మంచిదే అయినప్పటికీ ..కేంద్రం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..