Begin typing your search above and press return to search.
ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి .. సమావేశానికి దూరంగా చంద్రబాబు
By: Tupaki Desk | 17 March 2021 1:26 PM ISTఈరోజు ఏపీ సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపికపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈ ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసనమండలి చైర్మన్ షరీఫ్, శాసనసభ స్పీకర్ తమ్మినేని, రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి సుచరిత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు తదితరులకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్, సభ్యులు ఎంపిక కోసం కమిటీ సమావేశానికి హాజరు కావాలని సీఎస్ కార్యాలయం కమిటీ సభ్యులకు సమాచారం అందించింది. అయితే చైర్మన్ ఎంపిక కమిటీ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు.ఈ నిర్ణయానికి కట్టుబడి నేడు జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు , శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హాజరుకాలేదు.
ఇదిలా ఉంటే విభజన తరువాత ఏపీలో ఏర్పడనున్న మొదటి మానవ హక్కుల సంఘం ముగ్గురితో ఏర్పాటు కాబోతుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతలోని హైపవర్ కమిటీ ఛైర్మన్, ఇద్దరు సభ్యుల ఎంపిక స్క్రీనింగ్ పూర్తి చేసింది. మానవ హక్కుల సంఘం ఛైర్మన్ గా రిటైర్డ్ జడ్జి మందాటి సీతా రామమూర్తిని హైపవర్ కమిటీ ప్రతిపాదించింది. మానవ హక్కుల సంఘం సభ్యుడు జ్యుడీషియల్ మెంబర్ గా దండా సుబ్రమణ్యం.. నాన్ జ్యుడీషియల్ సభ్యుడిగా డా. గోచిపాత శ్రీనివాస రావు ను ఎంపిక చేసింది. గవర్నర్ ఆమోద ముద్ర పడగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అమల్లోకి రానుంది.