Begin typing your search above and press return to search.

ఆనందయ్య మందు: ఆ హెడ్ మాస్టర్ మృతి!

By:  Tupaki Desk   |   31 May 2021 12:00 PM IST
ఆనందయ్య మందు: ఆ హెడ్ మాస్టర్ మృతి!
X
ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య మందు సంచలనమైంది. ఈ మందు తీసుకున్న వారు కోలుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో బెడ్ పై వచ్చిన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఈ మందు తీసుకొని వెంటనే కోలుకున్నట్టు చెప్పిన ఒక వీడియో వైరల్ అయ్యింది.

అయితే తాజాగా సదురు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించాడన్న వార్త ప్రధాన మీడియాలో వచ్చింది. మరి ఆయన చనిపోయారా? లేదా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ఇక కరోనాతోనా? లేదా మరేదైనా కారణమా? అన్నది నిజనిజాలు తెలియాల్సి ఉంది.

గతంలో ఆనందయ్య మందుతో కోలుకున్నానని కోటయ్య చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆనందయ్య వైద్యాన్ని తప్పుగా నిరూపించడం కోసం ఆయన అస్వస్థతకు గురైన వీడియోను కొందరు సర్క్యూలేట్ చేశారు. తాజాగా ఆయన జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించారని అంటున్నారు.

అయితే ఆనందయ్య మందు తీసుకున్న అనంతరం ఆయన ఆక్సిజన్ లెవల్స్ పెరగడంతో కుదటపడ్డారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం తిరిగి విషమించడంతో కుటుంబసభ్యులు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలుస్తుంది .