Begin typing your search above and press return to search.
ప్రయాణికులపై మళ్లీ మొదలైన ఆంక్షలు ... ఆ పత్రం చూపిస్తేనే అనుమతి !
By: Tupaki Desk | 24 Nov 2020 1:00 PM ISTదేశంలో మళ్లీ కొంచెం కొంచెం గా కరోనా మహమ్మారి తీవ్రత పెరిగిపోతుంది. గత కొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలని ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమౌతుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, గోవా రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ వస్తేనే అనుమతిస్తామని మహా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ పాజిటివ్ వస్తే క్యారంటైన్ లో ఉండాలని , కరోనా నుండి కోలుకున్నాక రాష్ట్రంలోకి ప్రవేశం కల్పిస్తామని స్పష్టంచేసింది. నెగెటివ్ గా ధ్రువీకరించాలంటే కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్షల రిపోర్టులను చూపించాలని కోరింది.అలాగే . 72 గంటల కింద చేయించుకున్న పరీక్షలకు మాత్రమే అనుమతి ఉండనుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలనుని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రైళ్ల ద్వారా వచ్చే ప్రయాణికులు 96 గంటలలోపు రిపోర్టను చూపించాలి
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధించే అంశంపై రెండు వారాలు కరోనా కేసులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. మరోవైపు ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే కూడా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ కాకపోయినా సడలించిన ఆంక్షలను మళ్లీ విధించాల్సిన పరిస్థితి రావొచ్చని తెలిపారు. రాష్ట్రంలో కరోనా మళ్లీ మునుపటి స్థాయిలో పెరిగిపోకమునుపే ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వచ్చే పలు రాష్ట్రాల ప్రయాణికులపై మళ్లీ కొన్ని ఆంక్షలు విధించింది.
ఇకపోతే , రాష్ట్రంలో కొత్తగా 4,153 కోవిడ్ కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం బులెటిన్ లో వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 17,84,361 కు చేరుకుంది. అలాగే, సోమవారం ఒక్కరోజే 3,729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 16,54,793 కి పెరిగింది. కొత్తగా 30 కోవిడ్ మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 46,653 కు చేరుకుంది. రాష్ట్రంలో రికవరీ రేటు 92.74 శాతం కాగా, మరణాల రేటు 2.61 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక అంబేడ్కర్ 64వ మహా పరినిర్వాణ్ దిన్ సందర్భంగా డిసెంబర్ 6న ముంబైలో చైత్యభూమిలో ఉన్న బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ స్మారక చిహ్నం వద్దకు అభిమానులు రావొద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి పెరిగిపోతున్నందున అందరూ వారి వారి ఇళ్ల నుంచే అంబేడ్కర్‌కు నివాళి అర్పించాలని సూచించారు.