Begin typing your search above and press return to search.

కరోనా వైద్యులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   16 Dec 2020 12:30 AM GMT
కరోనా వైద్యులకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం .. ఏంటంటే ?
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలు కాపాడుకోవడానికే చూశారు. కానీ, కరోనా మహమ్మారి సోకిన పేషేంట్స్ కి ట్రీట్మెంట్ చేయడం ... ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని తెలిసినా కూడా డాక్టర్లు , వైద్య సిబ్బంది ,సహాయకులు, పారా మెడికల్‌ సిబ్బంది విధులు నిర్వహించారు. తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి ట్రీట్మెంట్ అందించారు. ఆ సమయంలో కేవలం కరోనా వారియర్స్ గా నిస్వార్థంగా సేవలు అందించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా , పసిపిల్లలని సైతం ఇంట్లోనే వదిలిపెట్టి లక్షల మందిని కరోనా వైరస్‌ బారి నుంచి గట్టెక్కించారు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

అందుకే కరోనా వారియర్లుగా దేశం ముందు నిలిచి మునుపెన్నడూ లేని విధంగా దేశ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. కరోనా సమయంలో ఉన్న దేశంలో ఉన్న కులం , మతం కేవలం డాక్టర్స్ , పోలీసులు మాత్రమే. ప్రజల గురించి అనుక్షణం తపిస్తూ .. వీధుల్లోనే ఎంతోమంది ప్రాణాలు వదిలారు. ఇదిలా ఉంటే , దేశంలో కరోనా వైరస్ కొంచెం అదుపులోకి రావడంతో వీరికి విశ్రాంతి కల్పించాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో వైరస్ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో కరోనా‌ విధుల నుంచి డాక్టర్లకు విశ్రాంతి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.

దేశంలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై నమోదైన సుమోటో పిటిషన్ పై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్ ‌ఎస్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షా తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం కరోనా రోగులకు సేవలందించిన డాక్టర్లకు విశ్రాంతి ఇవ్వకపోతే వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హెచ్చరించింది. కరోనా‌ సేవల్లో ఉన్న డాక్టర్లకు కొంత విశ్రాంతి ఇవ్వాలని కూడా సూచించింది. దీంతో ఈ విషయం తమ పరిశీనలో ఉందని కేంద్రం తరఫున తుషార్ మెహతా సుప్రీం కి తెలిపారు.

ఇకపోతే గత 24 గంటల్లో 22,065 కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 99,06,165కి చేరింది. అలాగే నిన్న 354 మంది కరోనాతో చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,43,709కి చేరింది. ప్రస్తుతం మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 34,477 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 94,22,636కి చేరింది.