Begin typing your search above and press return to search.

నాడు-నేడు అంటే ఇదేనా ... జనం రెస్పాన్స్ ఇదే !

By:  Tupaki Desk   |   25 Oct 2021 7:42 AM GMT
నాడు-నేడు అంటే  ఇదేనా ...  జనం రెస్పాన్స్ ఇదే !
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. తాము అనేక రూపాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో ముందుకు తీసుకువెళ్తామ‌ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో భావి భార‌త పౌరుల‌ను తీర్చిదిద్దే.. పాఠ‌శాల‌ల‌ను మ‌రింత స‌మున్న‌తంగా తీర్చిదిద్దుతామ‌ని.. విద్యార్థుల‌ను అంత‌ర్జాతీయ స్థాయి పోటీత‌త్వా నికి సిద్ద‌మ‌య్యేలా త‌యారు చేస్తామ‌ని.. చెప్పారు. ఈ క్ర‌మంలోనే నాడు-నేడు అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. తొలిద‌శ‌లో 2500 కోట్ల రూపాయ‌ల‌ను కూడా కేటాయించారు. ఇప్ప‌టికి రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అయితే.. తాజాగా ప్రారంభ‌మైన విద్యాసంవ‌త్స‌రంలో ఈ నాడు-నేడు ఏమై పోయింద‌నే వాద‌న నెటిజ‌న్ల నుంచి వినిపిస్తోంది.

నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా.. విద్యార్థుల‌కు యూనిఫాం, పుస్త‌కాలు. షూస్‌, బెల్ట్‌.. బ్యాగు ఇలా అన్నీ.. విద్యా సంవ‌త్స‌రం ప్రారంభానికి ముందుగానే ఇస్తామ‌ని.. జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది ఇది అమ‌లైనా.. ఇప్పు డు.. మాత్రం విద్యార్తులకు పుస్త‌కాలు ఇప్ప‌టికీ అంద‌లేదు. దీంతో నాడు -నేడు అంటే.. ఇదేనా జ‌గ‌నన్నా.. అంటూ .. నెటిజ‌న్లు స‌టైర్లు విసురుతున్నారు. ప్ర‌స్తుతం స్కూళ్ల‌లో పొజిష‌న్ ఎలా ఉందంటే.. ఈ విద్యా సంవత్సరం కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్యాంశ పుస్తకాలు ఇంకా అందలేదు. వాస్త‌వానికి తరగతులు ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా ఇంతవరకు పుస్తకాలు అందకపోవడంపై త‌ల్లిదండ్రులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు, పుస్తకాలను విద్యాశాఖ అందించారు. అయితే కొత్తగా చేరిన వారికి జగనన్న విద్యాకానుక కిట్ల ను ఇప్ప‌టికీ అందించ‌లేదు. దీంతో కొత్త విద్యార్థులు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు లేకుండానే సాధారణ డ్రెస్సులతో బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో 43,56,647 మంది, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1,97,291 మంది మొత్తంగా 45,53,938 మంది చదివారు. ఈ విద్యా సంవత్సరానికి రూ.731.30 కోట్లతో 47,32,164 కిట్లకు పాఠశాల విద్యాశాఖ ఆర్డర్లు ఇచ్చింది. అయితే.. సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కిట్లు అందలేదని అధికారులు అంచనా వేస్తున్నారు.

మ‌రోవైపు.. ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ కాకపోవడంతో తిప్పలు పడుతున్నారు. ఐదేళ్లు దాటిన పిల్లలు ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. విద్యార్థుల తల్లిదండ్రులు అప్‌డేట్‌ చేయించుకున్న 20 రోజుల తరువాత అప్‌డేట్‌ అవుతుందని పోస్టల్‌ శాఖ వారు చెబుతున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ గడువు దాటినా చైల్డ్‌ఇన్‌ఫోల్‌ అప్‌డేట్‌ అయినట్లు రావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఆధార్‌ అప్‌డేట్‌ కాని విద్యార్థుల సంఖ్య ప్రతి ప్రాథమిక పాఠశాలలో 15, ప్రతి ఉన్నత పాఠశాలలో 30 వరకు ఉంటాయి. దీంతో ఇదేనా నాడు-నేడు అంటే.. జ‌గ‌న‌న్నా.. అంటూ.. నెటిజ‌న్లు సటైర్లు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.