Begin typing your search above and press return to search.

పాక్ మోడ‌ల్ హ‌త్య‌కు కార‌ణం అదేన‌ట‌

By:  Tupaki Desk   |   17 July 2016 10:35 AM GMT
పాక్ మోడ‌ల్ హ‌త్య‌కు కార‌ణం అదేన‌ట‌
X

పాకిస్థాన్ మోడల్ - సోషల్ మీడియా సెలబ్రిటీ ఖందీల్ బలోచ్ హత్యకు కారణం తెలిసింది. ఆమె సోదరుడు వసీం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెలువ‌డిన అనుమానాలు నిజ‌మ‌య్యాయి. తానే ఖందీల్‌ ను హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంత‌రం వ‌సీం ఒప్పుకొన్నాడు.

పాకిస్థాన్ పోలీసుల వ‌ద్ద వ‌సీం వాంగ్మూలం ఇస్తూ...త‌న సోదరి వ‌ద్ద‌ని చెప్తున్న‌ప్ప‌టికీ మోడ‌లింగ్ వైపు మ‌ళ్లింద‌ని పేర్కొన్నాడు. అందుకే త‌ను సొంత ఇంటికి వ‌చ్చిన‌పుడు హ‌త్య చేసిన‌ట్లు చెప్పారు. ఇందులో తన మరో సోదరునికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇదిలాఉండ‌గా ఖందిల్ బులోచ్ అసలు పేరు ఫౌజియా అజీమ్. బలోచ్‌ కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువ. నిత్యం తన సెల్ఫీ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌ డేట్ చేస్తుండేది. దీంతో చాలా మంది ఫాలోవర్స్ ఉండేవారు. అయితే వసీంకు మోడలింగ్‌ పై మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. అంతేగాక సోషల్ మీడియాలో తన సోదరి వ్యాఖ్యలు - ఫొటోలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసేవాడు. ఈ విషయమై తన సోదరిని పలుసార్లు బెదిరించినట్టుగా కూడా తెలుస్తున్నది. అయినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన వసీం హత్య పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదిలాఉండ‌గా.... బ‌లోచ్ ఫొటోలే కాదు ఆమె వ్యాఖ్యలు కూడా సంచలనమే. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ ను పెళ్లిచేసుకోవాలని ఉందని, టీ 20 ప్రపంచకప్‌ లో ఆఫ్రిది నేతృత్వంలోని పాకిస్థాన్ టీం ఇండియాని ఓడిస్తే నగ్న ప్రదర్శనకు సిద్ధమేనని ప్రకటించింది. అంతేకాదు ఇండియా క్రికెటర్లను వదిలిపెట్టలేదు. విరాట్ కోహ్లిని ప్రేమిస్తున్నానని, అతడు చాలా అందంగా ఉన్నాడని పేర్కొంది. విరాట్ తన ప్రియురాలైన అనుష్కశర్మను వదిలేయాలని కూడా ప్రాధేయపడింది.