Begin typing your search above and press return to search.

బీజేపీకి సినీ గ్లామర్.. హీరోయిన్ చేరిక..

By:  Tupaki Desk   |   14 May 2018 9:58 AM GMT
బీజేపీకి సినీ గ్లామర్.. హీరోయిన్ చేరిక..
X
రాజకీయాలు, సినీ రంగాలను వేరు చేసి చూడలేం.. ఎందుకంటే సినీ కళాకారులే రాజకీయంగా ఎదిగి రాష్ట్రాలను ఏలారు.. ఓ ఎన్టీఆర్, ఓ జయలలిత అలా వచ్చిన వారే.. మెగాస్టార్ చిరంజీవి వచ్చినా ఆయనకు కాలం కలిసి రాక తెరమరుగుయ్యారు. రాజకీయాల్లో సినీ గ్లామర్ కోసం పార్టీలు చేయని పనంటూ లేదు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ గ్లామర్ అత్యధికంగా ఉంది టీడీపీ పార్టీకే.. ఆ పార్టీ తరఫున చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు పోటీ చేశారు. ప్రజాప్రతినిధులుగా కూడా ఎన్నికయ్యారు..

తాజా తెలంగాణలో బీజేపీ పార్టీ సినీ గ్లామర్ కోసం పరితపిస్తోంది.. వరుసగా తెలుగు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోందట.. తాజాగా వర్థమాన హీరోయిన్ రేష్మా రాథోడ్ బీజేపీలో చేరారు. ఆమె సామాజికవర్గ సమీకరణాలను అనుసరించి పాత వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించారు..

బీజేపీ కండువా కప్పుకున్న రేష్మా రాథోడ్ వచ్చే ఎన్నికల్లో మహబూబాబాద్ లో గెలిచి తీరుతానని స్పష్టం చేశారు. డోర్నకల్ లో పర్యటించిన ఆమె స్థానిక బీజేపీ నేతలను కలుసుకొని రాజకీయ సమీకరణాలను అడిగి తెలుసుకున్నారు. డోర్నకల్ లోని ప్రధాన వీధీలో రోడ్డు విస్తరణలో కూల్చిన దుకాణాలను పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రేష్మా మాట్లాడుతూ ‘‘నటిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నా.. తన స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు అని.. తన చదువు మణుగూరులో పూర్తయ్యిందని.. స్థానికురాలైన తనను ఆదరించాలని’’ కోరింది. మరి ఈ నటి కం రాజకీయ నాయకురాలు బీజేపీలో ఏమేరకు రాణిస్తుందో చూడాలి మరి..