Begin typing your search above and press return to search.
అలీబాగ్ నుండి తజోలా జైలుకు అర్ణబ్ ను తరలించడానికి కారణం ఏంటి !
By: Tupaki Desk | 9 Nov 2020 1:40 PM ISTఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముంద్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, అలీబాగ్ క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ఆయనను ఆదివారం ఉదయం తలోజా జైలుకు తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ మొబైల్ ఫోన్ ను వినియోగించడంతోనే తజోలా జైలుకు ఆయనను తరలించినట్టు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో అర్ణబ్ గోస్వామి సహా మరో ఇద్దర్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కిందట బుధవారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన గోస్వామి.. నాలుగు రోజులు అలీబాగ్ క్వారంటైన్ కేంద్రంలో నాలుగు రోజుల పాటు ఉన్నారు.
అక్కడ, ఆయనకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో తజోలా జైలుకు తరలించారు. ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను ఉపయోగించిన అర్ణబ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు శుక్రవారం రాత్రి గుర్తించామని రాయగఢ్ క్రైం బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జమిల్ షేక్ అన్నారు. అయితే, పోలీసులు ఆరోపిస్తున్నట్టు అరెస్ట్ తర్వాత గోస్వామి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్‌లు పెట్టలేదని రిపబ్లిక్ టీవీ తోసిపుచ్చింది. ఆయనను అరెస్ట్ చేసిన రోజే వ్యక్తిగత మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలీబాగ్ జైలు అధికారుల ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్ కేంద్రంలో ఉన్న నిందితుడు అర్ణబ్ కు మొబైల్ ఎక్కడ నుంచి వచ్చిందో నివేదిక కోరుతూ జైలు సూపరింటిండెంట్ కు విచారణాధికారిగా ఓ లేఖ రాయనున్నామని షేక్ తెలిపారు.
ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో భద్రత మధ్య తజోలా జైలుకు అర్ణబ్‌ను తరలించారు. ఈ సమయంలో తనపై అలీబాగ్ జైలర్ చేయి చేసుకున్నారని అర్ణబ్ గట్టిగా అరుస్తూ ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది.. తనకు సహాయం చేయాలని కోర్టుకు చెప్పాలని అన్నారు. అర్ణబ్ ఆరోపణలను తజోలా జైలు సూపరింటిండెంట్ అబాసాహెబ్ పాటిల్ ఖండించారు. కావాలంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లను చూసుకోవాలని, అర్ణబ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఒకవేళ అలీబాగ్ జైల్లోనే ఉంటే ఆయనకు మొబైల్ అందుతుందని, తలోజా జైలుకు తరలించడానికి అనుమతించాలని ఉన్నతాధికారులను కోరినట్టు ఇన్‌స్పెక్టర్ షైక్ అన్నారు.