Begin typing your search above and press return to search.

రిపబ్లిక్ డే పరేడ్: ఏ శకటానికి ఫస్ట్ ప్రైజ్ తెలుసా?

By:  Tupaki Desk   |   28 Jan 2021 4:12 PM IST
రిపబ్లిక్ డే పరేడ్: ఏ శకటానికి ఫస్ట్ ప్రైజ్ తెలుసా?
X
బీజేపీ అంటేనే హిందుత్వం.. హిందూ ఓటు బ్యాంక్ తోనే దేశంలో అధికారంలోకి వచ్చింది. ఆ హిందుత్వాన్ని దాచుకోకుండా వాడుకుంటుంది. శషభిషలు లేకుండా బీజేపీ నేతలు కూడా హిందుత్వంనే ఎజెండాగా పెట్టుకుంటారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ఓపెన్ హిందుత్వవాదిగా ప్రకటించుకొని ఎంఐఎం నేతలను విమర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఈసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో కూడా అదే ప్రతిధ్వనించింది. గణతంత్ర వేడుకల్లో వివిధ రాష్ట్రాలు పలు శకటాలను ప్రదర్శించారు. భారత సంస్కృతి, కళలు, సాహిత్య, దేశ ఆయుధ సంపత్తిని చాటే అనేక శకటాలు వేడుకలో కనువిందు చేశాయి.

వీటిల్లో ఉత్తరప్రదేశ్ ప్రదర్శించిన రామ మందిర నమూనా శకటం అందరినీ ఆకట్టుకుని ప్రథమ బహుమతి సొంతం చేసుకోవడం విశేషం.దశాబ్ధాలుగా నలిగిపోయి సుప్రీం తీర్పుతో రామమందిర నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నా రామమందిర నమూనాకే ఈ ప్రథమ బహుమతి దక్కడం విశేషం.రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రైజ్ మనీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ సందర్భంగా శకట తయారీదారులు, కళాకారులను అభినందించారు.