Begin typing your search above and press return to search.

ఈసారి పరేడ్ హాలీవుడ్ సినిమా!

By:  Tupaki Desk   |   27 Jan 2016 5:08 AM GMT
ఈసారి పరేడ్ హాలీవుడ్ సినిమా!
X
రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ కు సంబంధించి ఈసారి ఆసక్తికర అంశాలెన్నో చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది బాలీవుడ్ సినిమా మాదిరి రెండు గంటలకు పైగా సాగే పరేడ్.. ఈసారి మాత్రం అందుకు బిన్నంగా హాలీవుడ్ సినిమా మాదిరి కేవలం 90 నిమిషాల్లో (గంటన్నర) ముగియటం గమనార్హం. ఒక్క సమయం విషయంలోనే కాదు.. పలు అంశాల్లో పరేడ్ లో కొత్త లుక్ కనిపించింది. అలాంటి విశేషాలు చూస్తే..

= విదేశీ సైనికులు తొలిసారి పరేడ్ లో పాల్గొన్నారు. 48 మందితోకూడిన ఫ్రాన్స్ సైనిక బృందం ‘ద మ్యూజిక్ ఆఫ్ ది ఇన్ ఫాంట్రీ’ మార్చ్ ఫాస్ట్ లో పాల్గొంది.

= ఫ్రాన్స్ బృందం ప్రతిభకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి

= రెండు గంటలకు పైగా సాగే పరేడ్ తొలిసారి 90 నిమిషాలకే ముగిశాయి

= పరేడ్ లో తొలిసారి మాజీ సైనికుల శకటం కొలువు తీరింది

= పురుషులు మాత్రమే దర్శనమిచ్చే సీఆర్పీఎఫ్ దళం ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి పూర్తిగా మహిళలతో కూడిన దళం పరేడ్ లో పాల్గొని చరిత్ర సృష్టించింది

= ఇప్పటివరకూ ఢిల్లీ మహానగర చరిత్రలో లేని విధంగా పది కీలక ప్రాంతాల్లో లైట్ మెషీన్ గన్ లను ఏర్పాటు చేశారు

= ఇన్ని విశేషాలతో పాటు కొన్ని అంశాలు నిరాశ పర్చాయి. ప్రతి ఏటా కనువిందు చేసే అణు క్షిపణలు తాజా పరేడ్ లో దర్శనమివ్వలేదు

= పరేడ్ లో ప్రదర్శించే అణు క్షిపణులు కనిపించకపోవటం పలువురు నిరాశ చెందారు

= 2013 తర్వాత నుంచి అణు క్షిపణుల్నిప్రదర్శించకపోవటం గమనార్హం

= వివిధ రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 23 శకటాల్ని ప్రదర్శించారు