Begin typing your search above and press return to search.

రిపోర్టర్ మనోజ్ మరణంపై అతడి అన్న సంచలన నిజాలు

By:  Tupaki Desk   |   9 Jun 2020 10:50 AM GMT
రిపోర్టర్ మనోజ్ మరణంపై అతడి అన్న సంచలన నిజాలు
X
ప్రముఖు న్యూస్ చానెల్ లో క్రైం రిపోర్టర్ మనోజ్ కరోనాతో మృతిచెందడం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. అయితే ఆయన మరణం ఖచ్చితంగా గాంధీ ఆస్పత్రి వర్గాలు చేసిన నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని మనోజ్ అన్న సాయికుమార్ ఆరోపించారు.మనోజ్ తోపాటు గాంధీలో చికిత్స పొందుతున్న అతడి సోదరుడు సాయికుమార్ తాజాగా ఆస్పత్రి నుంచే ఓ వీడియో తీసి అందులో తన తమ్ముడు, రిపోర్టర్ మనోజ్ మరణానికి ముందు ఏం జరిగిందో సంచలన నిజాలు వెల్లడించాడు.

గాంధీ ఆస్పత్రిలో రిపోర్టర్ మనోజ్ కు సరైన చికిత్స అందలేదని అతడి సోదరుడు సాయికుమార్ ఆరోపించారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు ఏవీ లేవని ఆయన ఆరోపించాడు.

తన తమ్ముడు మనోజ్ కి శ్వాస ఆడడం లేదని.. చెప్పినా పట్టించుకోలేదని.. మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఏ డాక్టర్ రాలేదని సాయికుమార్ ఆరోపించారు. తర్వాత ఐసీయూలో బెడ్స్ లేవని వార్డుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేవని చెప్పారని మండిపడ్డారు.

సరైన సమయంలో చికిత్స అందలేదని.. ఆస్పత్రిలో సామాన్యులను పట్టించుకునే పరిస్థితి లేదని మనోజ్ అన్న సాయి వాపోయాడు.

కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా చూసిన దైన్యాన్ని క్రైం రిపోర్టర్ మనోజ్ వాట్సాప్ లో ఫ్రెండ్స్ కు షేర్ చేసుకున్నాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మనోజ్.. ఇక్కడ ఏమాత్రం బాగాలేదని.. నన్ను ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని స్నేహితులను వేడుకున్న ధైన్యం కనిపించింది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని.. తనను బతికించండి అని వేడుకుంటూ స్నేహితుడికి వాట్సాప్ చేసిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.. రోగం వచ్చిందని గాంధీ ఆసుపత్రికి వెళ్లే కన్నా.. స్వశానానికి వెళ్లి పడుకోవడం ఉత్తమం అని మనోజ్ అన్న మాట ఇప్పుడు తెలంగాణలో కరోనా కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి లోగుట్టును బయటపెడుతోంది.