Begin typing your search above and press return to search.
రేణూదేశాయ్ విషయంలో పవన్ అభిమానులు ఎందుకిలా ?
By: Tupaki Desk | 25 Feb 2019 6:49 PM ISTపవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవల మళ్లీ పెళ్లిచేసుకుని కెరీర్‌లో ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. టీవీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో పాటు ఇటీవల ఓ సినిమా చేయడానికి కూడా సంతకం చేశారు. తన జీవితం తాను గడుపుతున్నప్పటికీ కూడా పవన్ కల్యాణ్ నీడ నుంచి.. పవన్ మాజీ భార్య అన్న ముద్ర నుంచి ఇంకా ఆమె బయటపడలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడడానికి తాజాగా ఆమె కర్నూలులో పర్యటించడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. పవన్ కర్నూలు పర్యటనలో ఉన్నప్పుడే ఆమె కూడా కర్నూలులో పర్యటించడంతో ఆందరిలో ఆసక్తి ఏర్పడింది.
సాక్షి టీవీలో మట్టి మనుషులు అనే ప్రోగ్రాం కోసం రేణూదేశాయి ఒప్పందం చేసుకుంది. అందులో ఆమే వ్యాఖ్యాత. రైతు సమస్యలను ప్రభుత్వాల దృష్టికితేవడం ఈ ప్రోగ్రాం లక్ష్యం. అయితే, ఈ ప్రోగ్రాం అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. పవన్ రాజకీయ ప్రత్యర్థులతో రేణు చేతులుకలిపారంటూ పవన్ అభిమానులు కూడా ఆమెపై విరుచుకుపడేవారు. ఇప్పుడు తాజా పర్యటనపైనా పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
అయితే.. రేణును పవన్అభిమానులు ఇలా టార్గెట్ చేయడాన్ని అంతా తప్పుపడుతున్నారు. రేణు ఇప్పుడు పవన్ భార్య కాదు.. వేరొకరి భార్య. కెరీర్ అయినా, రాజకీయాలైనా ఆమె ఇష్టాలు ఆమెవి. ఆమె కెరీర్ లో భాగంగా సినిమాలు చేస్తారో, టీవీ షోలు చేస్తారో.. లేదంటే రాజకీయాలను ఎంచుకుంటారో.. ఏ పార్టీలో చేరుతారో అంతా ఆమె ఇష్టం. కానీ.. పవన్ అభిమానులు మాత్రం ఈ లాజిక్ మర్చిపోయి సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేస్తున్నారు.