Begin typing your search above and press return to search.
జాబ్ నుంచి తీసేశారు.. కరోనాతో చనిపోయారు.. కోర్టుకెక్కిన భార్య
By: Tupaki Desk | 1 Oct 2021 10:01 AM ISTప్రపంచాన్ని అతలాకుతులం చేసిన కరోనా కారణంగా ఎన్నెన్ని ఉదంతాలు చోటు చేసుకున్నాయో చెప్పలేని పరిస్థితి. కరోనామహమ్మారికారణంగా దేశాలకు దేశాల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ లెక్కన వ్యక్తిగత జీవులకు ఎదురైన తిప్పలు అన్ని ఇన్ని కావు. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇక.. కరోనా బారిన పడి మరణించిన వారెందరో. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా నేపథ్యంలో ఉద్యోగం పోవటం.. ఆ తర్వాత భర్త కరోనాతో మరణించిన నేపథ్యంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ ఇదెక్కడ జరిగింది? అసలేం జరిగిందన్న విషయాల్లోకివెళితే.. తమిళనాడుకు చెందిన 48ఏళ్ల రమేశ్ సుబ్రమణియన్ ఒక ప్రైవేటు కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా జాబ్ చేసేవారు. కరోనా నేపథ్యంలో కంపెనీకి ఎదురైన సమస్యల్లో భాగంగా రమేశ్ ను జాబ్ నుంచి తీసేశారు. నోటీస్ పిరియడ్ లేకుండా రెండు రోజుల వ్యవధిలోనే అతడ్ని విధుల నుంచి రిలీవ్ చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించిన రెండునెలలకు కరోనా సోకటం.. 2021లో అతడు మరణించటం జరిగిపోయాయి. నోటీస్ పీరియడ్ ఇచ్చే అవకాశం లేకుండా జాబ్ తీసేయటంతో తనకు రావాల్సిన బీమా ప్రయోజనాలు రాకుండా పోయాయని.. అందుకు కంపెనీబాధ్యత తీసుకొని తనకు నష్టపరిహారం ఇవ్వాలని సదరు భార్య డిమాండ్ చేస్తోంది. మరి.. దీనికి కోర్టు ఏమని ఆదేశాలు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.