Begin typing your search above and press return to search.

మోడీ కోసం.. ఎక్క‌డున్న‌వారు అక్క‌డ నుంచే!!

By:  Tupaki Desk   |   30 Dec 2022 7:00 AM IST
మోడీ కోసం.. ఎక్క‌డున్న‌వారు అక్క‌డ నుంచే!!
X
దేశంలో సంస్క‌ర‌ణ‌లు మంచివే. అయితే.. అవి ప్ర‌జ‌ల కోస‌మా.. నాయ‌కుల కోస‌మా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఎందుకంటే.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఎలాంటి ప‌నిచేసినా.. సొంత లాభ‌మే ఎక్కువ‌గా ఉంటోంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక‌, రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు కొద‌వే లేదు. ఈ ప‌రంప‌ర‌లోనే.. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. సంచ‌ల‌న నిర్న‌యం తీసుకోవ‌డం.. ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

దేశంలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక స‌మ‌రానికి సంబంధించి.. సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేసింది. ఎక్క‌డివారు అక్క‌డ నుంచి ఓటు వేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది. ఇది మంచిదేగా.. దీనిలో మోడీ స్వార్థం ఏంటి? అనేదేగా ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఉంది.. అస‌లు కిటుకు.. ఎక్క‌డివారు అక్క‌డ ఉన్నప్ప‌టికీ.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే దీనిని అమ‌లు చేయాల‌ని భావించినా.. బీజేపీ అడ్డుప‌డింది.

ఎందుకంటే.. కాంగ్రెస్‌కు ఎక్క‌డ ల‌బ్ధి చేకూరుతుందో అని! మ‌రి ఇప్పుడు.. ఓటు బ్యాంకు చీలిపోవాల‌ని! ఇదే వ్యూహాన్ని మోడీ కొన్నాళ్లుగా పాటిస్తున్నారు. ఇటీవ‌ల గుజ‌రాత్‌లో ఇంటింటికీ బ్యాలెట్ ఓటు సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక‌, ఇప్పుడు ఎక్క‌డివారు అక్క‌డ నుంచి ఓటేసే సౌక‌ర్యాన్ని తీసుకువ‌స్తున్నారు.

వాస్త‌వానికి ఎన్నికల సమయంలో ఉపాధి కోసం వేర్వేరు రాష్ట్రాలకు వలస వెళ్లిన వాళ్లు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం, డబ్బు.. రెండూ వృథా అవుతాయనే ఆలోచనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో రిమోట్‌ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌(RVM) పద్ధతిని తీసుకురావాల‌ని గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ప్ర‌తిపాదించారు.కానీ, అప్పుడు వ‌ద్ద‌ని ఇప్పుడు త‌లూపింది కేంద్రం. మ‌రి దీని వెనుక ఉన్న రాజ‌కీయం ఏంటో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.