Begin typing your search above and press return to search.
ఏపీలో ఏంటి ‘మత’ రాజకీయం?
By: Tupaki Desk | 23 Sept 2020 3:40 PM ISTకులం నీకు ఎమిచ్చిందంటే? ‘కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది’.. ‘చంపుకోవడానికి పగను పంచింది’ అన్నాడట వెనుకటికి ఎవడో.. దేశంలో ఇప్పటికీ మత, కుల విద్వేశాల మాటున మనుషులు ఆవిరైపోతూనే ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఢిల్లీలో రెండు వర్గాలకు జరిగిన మతకల్లోలాలను ఎవరూ మరిచిపోలేదు.దాదాపు 50 మంది అమాయకులు చనిపోయారు.
ఇక కులాల మాటున పల్లెలు, పట్టణాల్లో జరిగే అమానుషాలకు లెక్కలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను మతప్రాతిపదికన విభజించి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే తంతు జరుగుతుందా అంటే ఔననే సమాధానం వస్తోంది.
గత చంద్రబాబు ప్రభుత్వంలోనూ మత, కులాల ప్రాతిపదికన దారుణాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. బలమైన టీడీపీ మీడియా దాన్ని కవర్ చేయలేదు. ప్రతిపక్షాలు అందిపుచ్చుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ, దాని అనుకూల మీడియా, బీజేపీ కూడా తోడై ఏపీలో విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు మేధావులు, విశ్లేషకులు.
తాజాగా ఏపీలోని ఆలయాల్లో అపశృతులు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. ఈరోజే ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండలో గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా మండపేటలో మేరిమాత విగ్రహాన్ని ధ్వంసం చేయడం కలకలం రేపింది. చర్చి ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు.ఈ విషయం తెలుసుకున్న ఆ వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు.
ఇప్పటికే ఏపీలో అంతర్వేది రథం దగ్ధం, ఇంద్రకీలాద్రిలో వెండి సింహాలు మాయంపై దుమారం రేగుతోంది. మరోవైపు ఆలయాల్లో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఇలా వరుసగా ఏపీలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించి ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే కుట్ర జరుగుతోందా అన్న కోణంలోనే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఇప్పటికే ఆలయాల వద్ద వరుస ఘటనలతో ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ పెంచింది. అంతర్వేతి రథంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అయినా ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలు చేస్తూ మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక వాటిని అందిపుచ్చుకొని బీజేపీ సహా టీడీపీ ప్రతిపక్షాలు మత రాజకీయాలు చేస్తూ చలి కాచుకుంటున్నాయని విశ్లేషకులు.. నెటిజన్లు మండిపడుతున్నారు. మతాల పేరుతో రాజకీయం మానుకోండని.. మానవత్వం చాటండని.. ఏ కులం, మతం అయినా అందరూ సంయమనం పాటించాలని హితవు పలుకుతున్నారు. రెచ్చగొట్టేలా.. విద్వేశ రాజకీయాలు పెంచి పోషించవద్దని కోరుతున్నారు. మతం ముసుగులో ఈ ఓట్లు దండుకోవడం.. రాజకీయ బలాన్ని పెంచుకునే కుట్రలకు తెరతీయవద్దని మేధావులు సైతం సూచిస్తున్నారు. ప్రజల మధ్య ప్రశాంత వాతావరణం ఉండేలా పార్టీలు వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు.