Begin typing your search above and press return to search.

దేశంలో పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ సిద్ధం ... ఎక్కడ ఏర్పాటు చేశారంటే !

By:  Tupaki Desk   |   3 April 2020 7:30 PM IST
దేశంలో పూర్తిస్థాయి కరోనా హాస్పిటల్ సిద్ధం ... ఎక్కడ ఏర్పాటు చేశారంటే !
X
కరోనా వైరస్ మహమ్మారి ... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అలజడి రేపుతోంది. ప్రస్తుతం దేశంలో చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ కరోనా వైరస్ చైనా లో డిసెంబర్ లో వెలుగులోకి వచ్చినా కూడా ఇప్పటి వరకు దీనికి సరైన వ్యాక్సిన్ కనిపెట్టలేదు. దీనితో సామజిక దూరం పాటిస్తేనే ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలం అని భావించిన చాలా దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. మన దేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో కట్టడి చేసేందుకు లాక్ డౌన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఈ లాక్ డౌన్ వలన ప్రజలు వారి ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఈ ప్రాణాలు తీసే వైరస్ నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే ఏర్పాటు చేసిన కార్యక్రమం ఈ లాక్ డౌన్ కావడంతో దీనికి ప్రతి ఒక్కరు దీన్ని పాటిస్తున్నారు. ఇదిలా ఉంటె, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కరోనా హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది.

దీని కోసం రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ముంబైలో 100 పడకలతో కూడిన పూర్తి స్తాయి కరోనా హాస్పిటల్ ను ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్ లో కేవలం కరోనా వైరస్ కు సంబంధించిన చికిత్స మాత్రమే అందించనున్నారు. అలాగే కరోనా వైరస్ కు చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఈ హాస్పిటల్ లో చేసారు. వెంటిలేటర్స్ తో పాటు అన్ని వసతులను ఈ హాస్పిటల్ లో అమర్చారు.