Begin typing your search above and press return to search.

ముఖేశ్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారే!

By:  Tupaki Desk   |   16 Aug 2017 10:11 AM GMT
ముఖేశ్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారే!
X
దేశ‌మంతా ఉచిత ఇంట‌ర్‌నెట్ అంటూ టెలీకాం రంగంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తూ ఎంట్రీ ఇచ్చింది జియో!! ఎప్ప‌టి క‌ప్పుడు సంచ‌ల‌న ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ.. మిగిలిన సంస్థల య‌జ‌మానుల‌కు నిద్ర‌లేకుండా చేస్తున్నారు ముకేశ్ అంబానీ! జియో ప్రైమ్‌ - జియో ధ‌నాధ‌న్ ఆపర్లు - జియో ఫీచ‌ర్ ఫోన్‌ అంటూ.. వినియోగ‌దారుల‌ను స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళుతున్నారు. ఇప్ప‌టికే జియో దెబ్బ‌కు ఆదాయం త‌గ్గిపోయిందని ఆప‌రేటర్లు ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో.. జియో స‌రికొత్త ఆఫ‌ర్‌ ను ప్ర‌క‌టించింది. ఎప్పుడు ఏ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌తో తమ నెత్తిన పిడుగు వేస్తుందో అని భ‌య‌ప‌డుతున్న‌ సంస్థ‌ల‌కు గ‌ట్టి షాక్ ఇచ్చింది. పేటీఎం - ఫోన్ పే ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌ ను వెల్ల‌డించింది.

ప్రస్తుతం అన్ని రిచార్జుల‌కు పేటీఎం - ఫోన్ పే వంటి వాటిని మొబైల్‌ వినియోగ‌దారులు అధికంగా వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే! ఇప్పుడు దీనిని కూడా క్యాష్ చేసుకునే ప‌నిలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప‌డ్డారు. తాజా నివేదికల ప్రకారం ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ జియో పేటీఎం - ఫోన్‌ పే యాప్‌ ల ద్వారా రీచార్జ్‌ లపై క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. పేటీఎం ద్వారా రూ.300 ఆఫర్‌ పై రూ.76ల క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. ఫోన్‌ పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ అందిస్తోంది. దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

పేటీఎం యాప్‌ లో మొబైల్ ప్రీపెయిడ్ లేదా మొబైల్ పోస్ట్‌ పెయిడ్ అప్షన్స్‌ ను ఎంచుకుని జియో ఫోన్‌ నెంబర్‌ ను ఎంటర్‌ చేసి ప్రోగ్రెస్ టు రీఛార్జ్ పై క్లిక్ చేయాలి. త‌ర్వాత‌ ప్రోమో కోడ్‌ ను కూడా జతచేయాలి. దీంతో రీచార్జ్‌ పూర్తవుతుంది. రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరబోతోంది. ఇప్ప‌టికే త‌మ స‌ర్వీసులు ప‌డిపోతున్నాయ‌ని ఇత‌ర స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఒక ప‌క్క గంద‌ర‌గోళ‌ప‌డుతున్నారు. జియోపై దిగ్గ‌జ సంస్థ‌లు ఎయిర్‌ టెల్ పోరాటం చేస్తూనే ఉంది. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఉచిత ఫీచర్‌ ఫోన్‌ వినియోగదారుల చేతుల్లోకి రానుంది. రిలయన్స్‌ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వొడాఫోన్‌ ఫిర్యాదు కూడా చేసిన విష‌యం తెలిసిందే!