Begin typing your search above and press return to search.

పోకేమాన్ గో...ఇక మన ద‌గ్గ‌ర ర‌చ్చ‌

By:  Tupaki Desk   |   14 Dec 2016 4:07 AM GMT
పోకేమాన్ గో...ఇక మన ద‌గ్గ‌ర ర‌చ్చ‌
X
అంత‌ర్జాతీయ ర్యాంకింగ్ లో అత్యంత సంచలనాత్మక మొబైల్ వీడియో గేమ్ గుర్తింపు పొంది ‘పోకేమాన్ గో’.. ఎట్టకేలకు భారతీయ మార్కెట్‌ లోకి అడుగిడుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భాగస్వామ్యంతో భారత్‌ కు ఈ సుపరిచిత గేమ్ పరిచయమవుతోంది. బుధవారం నుంచి దేశంలో ఈ గేమ్‌ను గూగుల్ ప్లే - యాప్ స్టోర్ల ద్వారా డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు.

మా రెండు సంస్థ‌ల ఈ భాగస్వామ్యంతో వేలాది రిలయన్స్ డిజిటల్ స్టోర్లు - ఎంపిక చేసిన భాగస్వామ్య స్టోర్లలో - ‘పోకేస్టాప్స్’ లేదా ‘జిమ్స్’లలో డిసెంబర్ 14 నుంచి పోకేమాన్ గో గేమ్‌ ను పొందవచ్చు.’ అని ఓ ప్రకటనలో రిలయన్స్ జియో తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31దాకా జియో సిమ్ కస్టమర్లు కూడా పోకేమాన్ గో గేమ్‌ ను ఎలాంటి చార్జీలు లేకుండా డౌన్‌ లోడ్ చేసుకుని ఆడుకోవచ్చని చెప్పింది. కాగా, ఈ ఏడాది జూలైలో పరిచయమైన ఈ గేమ్.. అనతికాలంలోనే లక్షలాది వినియోగదారులను సంపాదించుకుంది. అయితే ఇప్పటిదాకా భారత్‌ లో ఇది అధికారికంగా అందుబాటులో లేదు. ఇప్పుడు రిలయన్స్ జియో ద్వారా అందుబాటులోకి వచ్చింది.

కాగా ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన రియాలిటీ గేమ్ పోకెమాన్ ఇపుడు అనేక క‌ల‌క‌లాలు సృష్టించింది. పోకేమాన్ క్రేజ్‌ లో ప‌డి ఇబ్బందుల పాల‌వుతున్న విష‌యాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తూ షాకింగ్‌ కు గురిచేశాయి. ఈ గేమ్ ఆడుతూ అమెరికాలో ఓ వాహనదారుడు పోలీసు వాహనాన్నే గుద్దేశాడు! మరో ఘటనలో ఈ గేమ్‌ ను మ‌త్తులో ప‌డి ఓ యువతి తల చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయింది!! అదే రీతిలో ఆటలో మునిగిపోయి కెనడాకు చెందిన ఇద్దరు సోదరులు ఏకంగా అమెరికా-కెనడా సరిహద్దు దాటడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/