Begin typing your search above and press return to search.
జియో వాటా కొన్న ముబాదలా బ్యాక్ గ్రౌండ్ అలాంటిదా?
By: Tupaki Desk | 6 Jun 2020 10:15 AM ISTఅప్పు చేయటం పెద్ద విషయం కాదు కానీ దాన్ని తీర్చటమే గొప్ప విషయంగా పలువురు చెబుతుంటారు. ఈ సూత్రం వ్యక్తులకే కాదు.. వ్యవస్థలకు.. కంపెనీలకు కూడా వర్తిస్తుంది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంగతే చూద్దాం. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. అలాంటి ఆయన కంపెనీకున్న అప్పు ఎంతో తెలుసా? ఏకంగా రూ.1.61లక్షల కోట్లు. ఇంత భారీ అప్పు ఉన్న వేళ.. తన కంపెనీని అప్పుల్లేనిదిగా మారుస్తానంటూ మాట ఇచ్చారు.
ముకేశ్ మాట ఇవ్వటమంటే మాటలా? అందునా తన కంపెనీలోని షేర్ హోల్డర్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం బంగారు బాతులాంటి జియోలో వాటాలు అమ్మకానికి తెర తీశారు. ఆరంభంలోనే అదిరే డీల్ ఓకే చేశారు. ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ఫేస్ బుక్ తో జత కట్టిన ముకేశ్.. తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ప్రపంచం మొత్తం ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వేళలో.. అదిరే ఆరు డీల్స్ ఫైనల్ చేశారు. తాజాగా అబుదాబికి చెందిన ముబాదలాతో డీల్ ఓకే చేసుకున్నారు. వినూత్న వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ సంస్థనుచెబుతారు. యుఏఈలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ముబాదలాకు గుర్తింపు ఉంది.
కార్పొరేట్ ప్రపంచంలో సుపరిచితమైన ఈ సంస్థ 2017లో వెంచర్స్ విభాగాన్ని షురూచేసింది. ప్రస్తుతం అమెరికా.. యూరప్.. మధ్య ప్రాచ్య దేశాల్లో పలు వెంచర్ ఫండ్స్ నునిర్వహిస్తోంది. అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్.. సెమీ కండక్టర్స్.. మెటల్స్.. మైనింగ్.. ఫార్మా.. మెడికల్ టెక్.. పవర్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టటం దీనికిఅలవాటు. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థల ఎదుగుదలతో ముబాదలా పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఏమైనా.. తన సంస్థలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల పోర్టుఫోలియోలతో జియో రేంజ్ ను అంతకంతకూ పెంచేస్తున్న ముకేశ్ అంబానీ..తన లక్ష్యమైన రుణ రహిత రిలయన్స్ కలకు దగ్గరవుతున్నారని చెప్పక తప్పదు.