Begin typing your search above and press return to search.

భార‌తీయులందరికీ..ఉచితంగా జియోఫోన్లు

By:  Tupaki Desk   |   21 July 2017 7:30 AM GMT
భార‌తీయులందరికీ..ఉచితంగా జియోఫోన్లు
X
భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం రిల‌యెన్స్ మ‌రో అద్భుతం చేసింది. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో ఉన్న 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ ను ఇండియ‌న్స్ అంద‌రికీ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు రిల‌యెన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్ర‌క‌టించారు.రిల‌యెన్స్ 40వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అయితే ఉచితాన్ని మిస్ యూజ్ చేయొద్ద‌న్న కార‌ణంగా రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. దీనిని మూడేళ్ల త‌ర్వాత తిరిగి చెల్లిస్తామ‌ని అంబానీ స్ప‌ష్టంచేశారు.

కాగా, ఈ జియో ఫోన్‌లో అదిరిపోయే ఫీచ‌ర్లు ఉన్నాయి. ఈ 4జీ ఎల్‌ టీఈ ఫోన్ మొత్తం వాయిస్ క‌మాండ్స్‌తోనే ప‌ని చేస్తుంది. ఫోన్ చేయాల‌న్నా.. మెసేజ్ పంపాల‌న్నా.. జియో యాప్స్‌ను యూజ్ చేయాల‌న్నా అన్నీ వాయిస్ క‌మాండ్స్‌తోనే ఈ ఫోన్ ప‌ని చేస్తుంది. దేశంలోని అన్ని భాష‌ల‌ను ఈ ఫోన్ అర్థం చేసుకుంటుంది. ఈ డెమోను అంబానీ కూతురు ఇషా - ఆకాశ్ అందించారు. మ‌రోవైపు టారిఫ్స్ కూడా త‌న‌దైన స్టైల్లో అంబానీ ప్ర‌క‌టించారు. నెల‌కు రూ.153కే ఈ జియో ఫోన్‌ లో అన్‌ లిమిటెడ్ డేటా అందించ‌నున్నారు. అన్ని వాయిస్ కాల్స్ ఫ్రీ అని ప్ర‌క‌టించారు.

కాగా ఈ సంద‌ర్భంగా అంబానీ ఉద్వేగానికి లోన‌ర్యారు. ఈ 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని చెబుతూ.. అనిల్ అంబానీ కంట‌త‌డి పెట్టారు. దీంతో ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కోకిలాబెన్ కూడా విల‌పించారు. 1977లో వస్త్ర‌వ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్త‌రించిన‌ట్లు అంబానీ చెప్పారు. ప్ర‌స్తుతం రిల‌యెన్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ ట‌ర్నోవ‌ర్ ప‌ది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్ల‌కు చేరింద‌ని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరార‌ని చెప్పారు. వెయ్యి ఉన్న షేరు ధ‌ర రూ. 16.5 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని ఆయ‌న తెలిపారు. త‌మ సంస్థ ఎదుగుద‌ల పూర్తిగా రిల‌య‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ధీరుభాయ్ అంబానీ ఘ‌న‌త మాత్ర‌మేన‌ని అంబానీ స్ప‌ష్టం చేశారు.