Begin typing your search above and press return to search.

రిలయన్స్​ భారీ ప్రాజెక్ట్​.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ గుజరాత్ ​లో నిర్మాణం

By:  Tupaki Desk   |   20 Dec 2020 1:40 PM IST
రిలయన్స్​ భారీ ప్రాజెక్ట్​.. ప్రపంచంలోనే అతిపెద్ద జూ గుజరాత్ ​లో నిర్మాణం
X
ప్రపంచప్రఖ్యాత వ్యాపారసంస్థ - మనదేశానికి చెందిన రిలయన్స్​ ఇండస్ట్రీ ఓ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నది. లాభాలు - నష్టాలు లెక్కలు వేసుకొని వ్యాపారం చేసే రిలయన్స్​ ఇప్పుడు ఓ జూను నిర్మించబోతున్నది. మనదేశంలో జూలు ఎక్కువగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. రిలయన్స్​ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ‘జూ’ ను మనదేశంలో నిర్మించబోతున్నది. ఇందుకు కేంద్ర - రాష్ట్రప్రభుత్వాలు కూడా అనుమతి ఇచ్చేశాయి. ప్రధాని మోదీ సొంతరాష్ట్రమైన గుజరాత్​లో ఆ భారీ జూను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే అతిపెద్ద జూ అంటే విస్తీర్ణం పరంగా కాదు.. ప్రపంచంలో ఏ జూలో లేనన్ని జంతువులు ఇక్కడ ఉండబోతున్నాయట.

గుజరాత్‌లోని జామ్ నగర్‌ లో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో ఉండే అన్నిరకాల జంతువులు ఇక్కడ ఉండబోతున్నాయి. జంతువులు - పక్షులు - సరీసృపాలు కూడా ఉండబోతున్నాయట. రిలయన్స్​ కంపెనీ జామ్ ​నగర్​ లో జూ ను కట్టబోతున్నట్టు గుజరాత్​ అధికారులు ధ్రువీకరించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద జూ కట్టబోతున్నామని దీనికి కేంద్ర - రాష్ట్రప్రభత్వాలు అనుమతులు ఇవ్వడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ పేర్కొన్నారు.

అయితే ఈ జూను గ్రీన్స్ జియోలాజికల్ - రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్ డమ్ గా పిలువనున్నారు.జామ్ నగర్‌ లో రిఫైనరీని నడుపుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ జూను నిర్మిస్తుందని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు ముఖ్య కార్యదర్శి ఎంకే దాస్ చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం (సర్దార్ వల్లభాయ్ పటేల్) గుజరాత్‌ లో ఉంది. ఇప్పడు అతిపెద్ద జూ కూడా గుజరాత్​ లోనే నిర్మించబోతున్నారు.