Begin typing your search above and press return to search.

ఛీ..ఛీ.. కోళ్లను రేప్ చేసే భర్త.. వాటిని కోసి వండే భార్య

By:  Tupaki Desk   |   21 Oct 2020 3:00 PM IST
ఛీ..ఛీ.. కోళ్లను రేప్ చేసే భర్త.. వాటిని కోసి వండే భార్య
X
కొన్ని ఉదంతాలు విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. ఇలాంటి నీచాలు కూడా ఉంటాయా? అన్న భావన కలుగుతుంది. విన్నంతనే వికారం పుట్టే ఇలాంటి ఉదంతాలు చెప్పటానికి కారణం.. దారుణమైన పరిస్థితులు చుట్టూ ఉంటాయి.. జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి మాత్రమే. మన చుట్టు ఉండే వారిలో ఎవరైనా ఉండొచ్చన్న సమాచారం ఇవ్వటానికి మాత్రమే. విషయంలోకి వెళితే.. యూకేకు చెందిన భర్త (విల్ రెహాన్ బైగ్) ఒకరు ప్రకృతికి విరుద్ధంగా కోళ్లను రేప్ చేసేవాడు. కోడి కనిపిస్తే చాలు.. దాన్ని బెడ్రూంలోకి తీసుకెళ్లి.. కళ్లు మూసుకున్నకామంతో వాటిని వేధించేవాడు. ఇలాంటి దరిద్రపు గొట్టు పనులు చేసినప్పుడు అడ్డుకోవాల్సిన భార్య.. అతడ్నిప్రోత్సహించటమే కాదు.. వీడియోలు తీసేదన్న ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు.. భర్త చేసే పాడు పనులకు ఆ కోళ్లు చనిపోతే.. వాటిని కోసి కూర వండుకు తినే ఛండాలమైన పనిని చేసేవారు. ఇలాంటి దారుణమైన పనులు ఎక్కువ కాలం గుట్టుగా సాగవు కదా. అలానే జరిగింది. దరిద్రపు పనుల్ని వీడియోలుగా తీసి.. వాటికి ఫ్యామిలీ వీడియోస్ అన్న పేరు పెట్టి భద్రపరిచే వారు. అనుకోని రీతిలో ఈ వీడియోలుకాస్తాబయటకు వచ్చాయి. విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. భార్య.. భర్తల్ని అరెస్టు చేశారు.

ఈ కేసు కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ దారుణం గురించి విన్న న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసు వివరాల్ని విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. అత్యంత నీచాతి నీచమైన, వికృతమైన చర్యకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటోడు సభ్య సమాజంలో ఉండాల్సిన వాడు కాదంటూ.. అతడికి మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఈ కేసు నుంచి అతడి భార్య (హలీమా బైగ్) మాత్రం తప్పించుకుంది. ఆమె వాదన ఏమంటే.. తన భర్త విపరీతమైన లైంగిక వేధింపులతో తాను ఇబ్బంది పడేదానినని.. అతడి ఒత్తిడి మేరకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించాల్సి వచ్చినట్లు పేర్కొంది. నిజంగానే అంత బుద్ధిమంతురాలే అయితే.. భర్త చేసే పనుల మీద ఫిర్యాదు చేస్తే సరిపోయేది కదా? మొత్తమ్మీదా భార్య చేసిన వాదనకు కన్వీన్స్ అయిన కోర్టు.. ఆమెకు మాత్రం ఎలాంటి శిక్షను మాత్రం వేయకుండా వదిలేశారు.