Begin typing your search above and press return to search.
'ధరణి' లో సమస్యలెన్నో .. ఆలస్యమవుతున్న ఆస్తుల ఆన్‌లైన్ ప్రక్రియ !
By: Tupaki Desk | 5 Oct 2020 5:20 PM ISTతెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రావడంతో రిజిస్ట్రేషన్ విధానం మారిపోనుంది.. దీనిలో ధరణి పోర్టల్ కీలక పాత్ర పోషించనుంది.. ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజున ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్‌ను ఆరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అయితే , ఆ పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేయడానికి కొన్ని సమస్యలు ఎదురౌతున్నాయి.
వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇళ్లు, ఇతర నిర్మాణా లను డిజిటలైజేషన్ చేస్తూ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది. ఈ సమయంలో పలురకాల సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించి వివరాలను ఎంట్రీ చేయడం యంత్రాం గానికి తలనొప్పిగా మారుతోంది. ఈ క్రమంలో ఆస్తుల నమోదు ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా సాధ్యమయ్యే పనేనా అని చర్చించుకుంటున్నారు. ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదుకు సంబంధించి 40 రకాల అంశాలను పొందుపర్చాల్సి ఉంది. ప్రతి ఆస్తికి సం బంధించి యజమాని ఆధార్ కార్డు నంబర్, ఫోన్ నంబర్, భార్య/భర్త వివరాలు, వారి వారసుల పేర్లు, ఇళ్లు లేదా నిర్మాణం ముందు యజమాని లైవ్ ఫొటో దిగి ఆ వివరా లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన అంశాలన్నీ కుదిరితే ఒక ఆస్తిని అప్ లోడ్ చేయడానికి కనిష్టంగా 10 నిమిషాలు పడుతుంది. ఏ సమాచారంతప్పుగా ఉన్నా ఆన్ లైన్ లో నమోదు నిలిచిపోతోంది.
మరోవైపు ఈ నమోదు ప్రక్రియ గ్రామాల్లో మరింత అలస్యమవుతోంది. యజమాని అందుబాటులో ఉన్నప్పుడు ఇంటికెళ్లి వివరాలు ఎంట్రీ చేయడం ఇబ్బందిగా మారుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో చాలా చోట్ల యజమానులు ఉపాధి కోసం పట్ట ణానికి వలస వెళ్లడంతో ఆయా ఇళ్లకు రోజుల తరబడి తాళాలే కనిపిస్తు న్నాయి. మరోవైపు ఒంటరి వ్యక్తికి సంబం ధించిన ఆస్తి నమోదు కఠినతర మవుతోంది. ఎందుకంటే ఆ వ్యక్తి సహచరి పేరు లేదా వారసుల పేర్లను తప్పకుండా ఎంట్రీ చేయాల్సి ఉం టుంది. కానీ ఒంటరి వ్యక్తి కావడంతో సదరు దరఖాస్తు అర్ధాంతరంగా ఆగిపోతుంది. కొన్నిచోట్ల అటవీ భూముల్లో ఇళ్లు ఉండగా.. ధరణి యాప్‌లో అటవీ భూముల ఆప్షన్ లేదు. దీంతో ప్రభుత్వ భూమిలోనిర్మాణమున్నట్లు నమోదు చేయాల్సి వస్తోంది.
ధరణి వెబ్ సైట్ లో ఆస్తుల వివరాల ఎంట్రీ కోసం నిర్దేశించిన ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. 30 ఆస్తులలోపు ఎంట్రీలు చేసే ఎన్యుమరేటర్ కు ఒక్కో ఎంట్రీకి రూ.5 చొప్పున చెల్లింపులు చేస్తారు. 30 ఆస్తులకు మించి ఎంట్రీ చేస్తే ఒక్కో ఆస్తికి రూ.10 చొప్పున ఇస్తారు. ఒక ఎన్యుమరేటర్ ఒక రోజులో గరిష్టంగా 70 ఆస్తులను మాత్రమే ఎంట్రీ చేయాలి.