Begin typing your search above and press return to search.

రీజినల్‌ రింగు రోడ్డు : కేంద్రం వద్ద డీపీఆర్ !

By:  Tupaki Desk   |   30 Sep 2021 12:30 AM GMT
రీజినల్‌ రింగు రోడ్డు : కేంద్రం వద్ద డీపీఆర్ !
X
హైదరాబాదే కాకుండా యావత్‌ తెలంగాణ రూపురేఖలు మార్చేస్తుందని భావిస్తున్న హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టు క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డు సవివర నివేదిక కేంద్రానికి అందింది. దీనిపై అధ్యయనం తర్వాత భూ సేకరణ ప్రక్రియ కి అనుమతి ఇవ్వనుంది. ఔటర్ రింగ్ రోడ్డు కి అవతల 326 కిలోమీటర్ల మేర రెండు భాగాలుగా ఈ రీజినల్‌ రింగు రోడ్డు నిర్మించాలని కేంద్రానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో సంగారెడ్డి - నర్సాపూర్ -తూప్రాన్ -గజ్వేల్ -భువనగిరి -చౌటుప్పల్ రూట్ 158 కిలో మీటర్ల ను దక్షిణ భాగంగా ప్రతిపాదించారు. ఈ డీపీఆర్ నే కేంద్రానికి ప్రభుత్వం పంపింది.

హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ ఆర్‌)కు 50–70 కి.మీ. ఆవల నగరం చుట్టూ 339 (ఇందులో మార్పు ఉండొచ్చు) కి.మీ మేర ఆర్‌ ఆర్‌ ఆర్‌ ను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి నాలుగు వరసలుగా నిర్మించనున్న ఈ ఎక్స్‌ ప్రెస్‌ వే ఉత్తర భాగం అయిన సంగారెడ్డి– నర్సాపూర్‌– తూప్రాన్‌– గజ్వేల్‌– ప్రజ్ఞాపూర్‌– జగదేవ్‌పూర్‌– యాదగిరిగుట్ట–భువనగిరి–చౌటుప్పల్‌ వరకు ఉండే 164 కి.మీ. పరిధిని కేంద్రం ప్రస్తుతానికి భారత్‌ మాల పరియోజన ప్రాజెక్టులో చేర్చింది. ఈ భాగం నిర్మాణానికి రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా.

ఇక దక్షిణ భాగంలోని చౌటుప్పల్‌– ఇబ్రహీంపట్నం– కందుకూరు– ఆమన్‌గల్‌– చేవెళ్ల–శంకర్‌పల్లి–కంది–సంగారెడ్డి వరకు ఉండే మిగతా భాగం విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ మార్గంలో ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తాయో వివరాలు కావాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం జాతీయ రహదారుల విభాగం దీనిపై అధ్యయనం చేసింది. దాని ఆధారంగా కేంద్రం ఈ భాగాన్ని కూడా భారత్‌ మాల పరియోజనలో చేర్చనుంది. దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను నాగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న కే అండ్‌ జే ప్రాజెక్ట్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ అప్పగించింది.

హైదరాబాద్‌ నగరానికి 50 నుంచి 70 కి.మీ. దూరంలో ఈ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు 30 నుంచి 40 కి.మీ. దూరంలో ఉండనుంది.కొత్త రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూ 20కి పైగా ముఖ్య పట్టణాలను కలుపుతూ వెళుతుంది.తెలంగాణలోని 40 శాతం మంది ప్రజలకు ఈ కొత్త రింగ్‌ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది. హైదరాబాద్‌ కు వచ్చే అన్ని ప్రధాన హైవేలు, జాతీయ రహదారులను కలుపుతూ ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది.రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. రెండు దశల్లో నిర్మించనున్న ఈ రింగ్ రోడ్డుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.