Begin typing your search above and press return to search.

సీఎం జగన్ తో ఆ అన్నదమ్ముల భేటీ

By:  Tupaki Desk   |   12 Nov 2019 9:15 AM GMT
సీఎం జగన్ తో ఆ అన్నదమ్ముల భేటీ
X
కడప జిల్లాకు చెందిన రాజకీయ నేతలు మేడా మల్లిఖార్జున రెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. మేడా మల్లిఖార్జున రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే అని కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికలకు ముందు మల్లిఖార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారీ ఎత్తునమందీమార్బలంతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డిని పక్కన పెట్టి జగన్ మేడాకు అవకాశం ఇచ్చారు.

మంచి మెజారిటీలో మల్లిఖార్జున రెడ్డి విజయం సాధించారు. మంత్రి అవుతారనే అంచనాల్లో కూడా నిలిచారు. అయితే జగన్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆ సంగతలా ఉంటే.. మల్లిఖార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి అలిగారని అంటారు. అయితే ఇప్పుడు రఘునాథ్ రెడ్డి కూడా వచ్చి జగన్ ను కలిశారు. వీరు రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి గురించి సీఎంతో చర్చించినట్టుగా ప్రకటించారు.

మరి మంత్రి పదవి విషయంలో మల్లిఖార్జున రెడ్డికి అవకాశం మొదట్లో దక్కలేదు. మరి సగం టర్మ్ అయిన తర్వాత జరిగే పునర్వ్యస్థీకరణలో పదవి గురించి మల్లిఖార్జున రెడ్డి హామీ పొందారా ఈ భేటీతో? అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.