Begin typing your search above and press return to search.

ఆ కేంద్ర మంత్రికి రెడ్ కార్పెట్టే డేంజరైంది..

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:15 AM GMT
ఆ కేంద్ర మంత్రికి రెడ్ కార్పెట్టే డేంజరైంది..
X
కేంద్ర మంత్రి వస్తే స్వాగత సత్కారాలు మామూలుగా ఉండవు కదా....ఎర్రతివాచీలు, పూలబొకేలు... అబ్బో ఆ హడావుడే వేరు. అయితే.. ఆ హడావుడే అనుకోకుండా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ప్రమాదంలో పడేసింది. అయితే.. అదృష్టవశాత్తు ఆయన ఎలాంటి అపాయం లేకుండా బయటపడ్డారు.

హల్దియాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరవుతున్న నితిన్ గడ్కరీ కోసం అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ లో వస్తున్న ఆయన బూట్లకు మట్టి అంటకుండా హెలిప్యాడ్ వరకు ఎర్రతివాచీలు వేశారు. కానీ, ఆ ఎర్రతివాచీలే డేంజర్ గా మారుతాయని ఊహించలేదు. హెలీకాప్టర్ కిందకు దిగుతున్నప్పుడు గాలి దుమారం రావడంతో తివాచీలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి హెలీకాప్టర్ రోటర్ బ్లేడ్లకు చుట్టేశాయి. దాంతో హెలీకాప్టర్ పల్టీ కొట్టేసింది. అయితే... అదృష్టవశాత్తు మంత్రిగారికి ఎలాంటి ప్రమాదం జరగలేదట.