Begin typing your search above and press return to search.
షాక్ : కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి మెదడులో ... !
By: Tupaki Desk | 7 Aug 2021 11:47 AM ISTభారతదేశంలో కరోనా అలజడి కొనసాగుతుంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గినప్పటికీ, కరోనా లోని పలు వేరియంట్లు కలవరపెడుతున్నాయి. దీనితో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అయితే, తాజాగా వైట్ ఫంగస్ మెదడు లోకి కూడా ప్రవేశించి, ఏకంగా చీమునే సృష్టించింది. కరోనా సోకి నయమైన రోగి మెదడులో వైట్ ఫంగస్ ను కనుగొన్నట్లు హైదరాబాద్ వైద్యులు తెలిపారు. అయినా ఆ రోగికి మధుమేహం కూడా లేదని తెలిపారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఇలాంటి కేసు తెలంగాణలోని హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న రోగి మెదడులో వైట్ ఫంగస్ చీము ఏర్పడింది. ఈ రోగి మేలో కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. అప్పట్లోనే అవయవాల బలహీనత, మాట్లాడటం కష్టంగా ఉన్నట్లు వైద్యుల దృష్టికి తీసుకొచ్చారని సమాచారం. మందులు తీసుకున్న తర్వాత కూడా గడ్డలు ఏర్పడ్డాయని మెదడు స్కాన్ చేయడంతో, ఇదంతా తెలిసిందని డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఇప్పుడు రోగి మెదడులో వైట్ ఫంగస్ తో పాటు చీము ఏర్పడిందని తెలిపారు.
మెదడు లో వైట్ ఫంగస్ తోపాటు చీము ఏర్పడటాన్ని అరుదైన కేసుగా, సన్ షైన్ హాస్పిటల్ కు చెందిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథం తెలిపారు. సాధారణంగా కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత ఇన్ ఫెక్షన్ వస్తుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులైతే లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నారు. కానీ, ఈ రోగికి మధుమేహం లేదని అయినా ఫంగస్ వ్యాపించినట్లు వెల్లడించారు. బ్లాక్ఫం గస్వలే, వైట్ ఫంగస్ మెదడులోకి వెళ్లలేదన్నారు. ఆస్పెర్ గిల్లస్ ద్వారా మెదడు వాపు రావడం సాధారణం అయినప్పటికీ,చీము ఏర్పడే వైట్ ఫంగస్ కేసులు బయటకు రావడం అరుదని వెల్లడించారు.
సన్‌షైన్ హాస్పిటల్కు చెందిన సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ పి రంగనాథం మాట్లాడుతూ.. ఇది సంభవించడం చాలా అరుదు, రోగి మెదడులోకి తెల్ల ఫంగస్ కారణంగా చీము వచ్చింది. మెదడులో తెల్లటి ఫంగస్ ద్వారా ఏర్పడిన చీము ఉన్నందున ఈ కేసు ప్రత్యేకమైంది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్ వస్తుంది. సాధారణంగా, కోవిడ్రోగులలో ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు మధుమేహ వ్యాధిగ్రస్తులైతే కనిపిస్తాయి. కానీ,ఈ రోగికి మధుమేహం లేదు. బ్లాక్ ఫంగస్ వెళ్లినట్లు ముక్కులో నుంచి తెల్ల ఫంగస్ మెదడులోకి వెళ్లలేదు అని అన్నారు.
రోగి పరిస్థితిపై మరిన్ని వివరాలను వెల్లడిస్తూ.. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరిన ఆరో రోజున రోగి శరీరంలో బలహీనత, మాట్లాడటం కష్టంగా ఉందని చెప్పారని రంగనాథం తెలిపారు. ప్రారంభంలో రోగికి హెమటోమా కోసం చికిత్స చేశారని, అయితే ఎంఆర్ఐ తరువాత పుండు పరిమాణం పెరిగిందని తెలిపారు. చిన్న గాయాలు మిగిలి ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ అరుదైన చీమును ఆస్పెర్‌గిల్లోసిస్ అని డాక్టర్ పేర్కొన్నారు. మెదడులోని రక్తనాళాలపై తెల్లటి ఫంగస్ దాడి చేయడం వల్ల ఏర్పడిందని ఆయన చెప్పారు. ఆస్పెర్ గిల్లస్ ద్వారా మెదడు వాపు (గ్రాన్యులోమా) సాధారణం అయినప్పటికీ, చీము ఏర్పడే తెల్ల ఫంగస్ కేసులను అరుదుగా చూస్తామని ఆయన తెలిపారు.