Begin typing your search above and press return to search.

గుడిలో పెళ్లికి రికార్డింగ్ డ్యాన్సులు

By:  Tupaki Desk   |   12 March 2016 10:43 AM GMT
గుడిలో పెళ్లికి రికార్డింగ్ డ్యాన్సులు
X
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి చెంత అపచారం చోటు చేసుకుంది. సత్యదేవుని సాక్షిగా ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడం వెలుగులోకి వచ్చింది. దేవాలయంలోని హరిహరసధన్ వద్ద జరుగుతున్న ఓ వివాహవేడుకల్లో మహిళా డ్యాన్సర్స్ తో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి స్థానిక టీడీపీ సర్పంచ్ - ఎంపీపీ తదితర నాయకులు కూడా హాజరై డ్యాన్స్ ల్లో మునిగిపోయారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ తతంగమంతా శుక్రవారం అర్థరాత్రి జరిగింది. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇలాంటి అసాంఘిక చర్యలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

కాగా ఈ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో ఆలయ ఈవో చర్యలకు దిగారు. తెల్లవారు జామున 3 గంటలకు జరగడంతో నృత్యాల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి ఘటనపై విచారణ జరుపుతామని చెప్పిన ఆయన అనంతరం వాటిని పరిశీలించి నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించిన పెళ్లి బృందానికి కూడా నోటీసులు ఇచచారు. వారి నుంచి వచ్చిన వివరణను పరిశీలించిన తరువాత క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.