Begin typing your search above and press return to search.

ఉర్జిత్ రాజీనామా.. దేనికి సంకేతం?

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:30 AM GMT
ఉర్జిత్ రాజీనామా.. దేనికి సంకేతం?
X
చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. ఆఫీసులో త‌మ‌కున్న హోదా గురించి అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పుకోవ‌టం మ‌న చుట్టూ ఉన్నోళ్ల‌లో చాలామందిని చూస్తుంటాం. ఇక‌.. కొంద‌రైతే తాము చేసే ఉద్యోగానికి మించింది మ‌రొక‌టి ఉండ‌ద‌న్న‌ట్లుగా ఫీల‌వుతుంటారు. చిన్న చిన్న ఉద్యోగాల విష‌యంలో ఇలా అనుకునే వారు.. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వెన్నుముక లాంటి ఆర్ బీఐకి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అంటే మాట‌లా?

ఈ ప‌ద‌వి రేంజ్ ఎంత‌న్న‌ది చాలా సింఫుల్ మాట‌ల్లో చెప్పాలంటే.. దేశంలో ప్రింట్‌ అయ్యే ప్ర‌తి నోటు మీద సంత‌కం ఉండే ప‌ద‌విని వ‌దులుకోవ‌టం అంటే మాట‌లా? అంత పె..ద్ద ప‌ద‌విని ప‌దవీ కాలానికి ముందే రాజీనామా చేసి పారేయ‌టం దేనికి నిద‌ర్శ‌నం? అంతా బాగున్న‌ట్లు క‌నిపించినా.. లోప‌ల ఏదో తెలియ‌నిది జ‌రుగుతున్న వైనం గ‌డిచిన కొంత‌కాలంగా క‌నిపిస్తూనే ఉంది.

వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేయ‌టం.. ప్ర‌తి దాంట్లో వేలు పెట్ట‌టం.. అన‌వ‌స‌ర జోక్యం.. నిర్ణ‌యాలు తీసుకునే అధికారాన్ని అంత‌కంత‌కూ కుదించివేయ‌టం లాంటి వాటితో మోడీ పాల‌న మీద ప‌లువురు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దేశం ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లువురు ప్ర‌ధాన‌మంత్రుల్ని చూసినా.. మోడీ త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించే వారిని చూసిన అనుభ‌వం లేదు. అందుకే.. ఆయ‌న‌తో పోరాడ‌లేక‌.. అదే స‌మ‌యంలో ఆత్మాభిమానాన్ని వ‌దులుకోలేక‌.. కూలిపోతున్న విలువ‌ల్ని క‌ళ్ల‌ప్ప‌గించి చూడ‌లేక‌.. మ‌న‌కెందుకురా భ‌గ‌వంతుడా అనుకుంటూ ఎవ‌రి దారి వారు చూసుకుంటున్న వైనం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

మోడీని పిచ్చిగా.. గుడ్డిగా అభిమానించి.. ఆరాధించే వారికి గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో దేశానికి జరిగిన మేలుతో పోలిస్తే.. కీడే ఎక్కువ‌గా ఉంద‌న్న మేధావుల మాట‌లు ఇంకా సామాన్య ప్ర‌జ‌లకు చేర‌లేదు. త‌న మాట‌ల‌తో తీవ్ర ప్ర‌భావితం చేసే మోడీని ఇప్ప‌టికి అభిమానించే వారు కోకొల్ల‌లు. ఇప్పుడిప్పుడే మోడీ మ‌త్తు నుంచి ప‌లువురు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని వ‌దిలిపెట్టేందుకు ఉర్జిత్ ఎందుకు సిద్ధ‌మ‌య్యారు? అన్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిని దోచేస్తున్న ప్ర‌శ్న‌.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ప్ర‌ధాని మోడీపైనా.. ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాల మీదా స‌మ‌ర శంఖాన్ని పూరించేందుకు విప‌క్షాలు ఏక‌మై.. ఢిల్లీలో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేసిన రోజు.. మ‌రో రోజులో కీల‌క‌మైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే వేళ‌.. పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ప్రారంభం కావ‌టానికి ఒక్క‌రోజు ముందు ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విని త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాలతో రాజీనామా చేస్తున్న‌ట్లుగా చెప్పేసిన ఉర్జిత్ నిర్ణ‌యం దేశానికి షాకింగ్ గా మారింది.

ఎప్ప‌టిలానే.. క‌డుపులో క‌త్తులు ఉన్న‌ప్ప‌టికీ పైకి తియ్య‌గా మాట్లాడే తీరు ప్ర‌ధాని మోడీలో ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతారు. చికాకు పెట్టించి.. ప‌ద‌వికి రాజీనామా చేసే వ‌ర‌కూ పోరు పెడుతూ.. నిత్యం చుక్క‌లు చూపిస్తున్న మోడీ స‌ర్కారుకు దండం పెట్టి వెళ్లిన నాటి ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ రఘురాం రంగ‌రాజ‌న్ ఉదంతాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆయ‌న ఆర్ బీఐ గ‌వ‌ర్న‌ర్ గిరిని వ‌దిలేసి.. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పుకునే ఉద్యోగం కోసం వెళ్లిన వైనం దేశ ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మైన‌ప్ప‌టికీ.. మోడీ మాత్రం ఆయ‌న్ను పొగిడిన తీరును చూసినోళ్లంతా అమ్మ‌.. మోడీ అనుకోకుండా ఉండ‌లేక‌పోయారు.

ర‌ఘురాం రాజ‌న్ వార‌సుడిగా.. మోడీ మ‌న‌స్ఫూర్తిగా తీసుకొచ్చిన ఉర్జిత్ ప‌టేల్ త‌న ప‌ద‌వీ కాలాన్ని పూర్తి చేయ‌కుండా.. మ‌ధ్య‌లోనే రాజీనామా చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌న్ను పొగిడేస్తే ట్వీట్ చేసి త‌న మేథోత‌నాన్ని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించిన మోడీ మైండ్ సెట్ కు ఫిదా కావాల్సిందే. ఏమైనా.. వ్య‌వ‌స్థ‌లు అంత‌కంత‌కూ భ్ర‌ష్టు ప‌ట్టిపోతున్న వైనం ఇప్ప‌టికే డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్న వేళ‌.. దేశ పౌరులు అలెర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే.. భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావొచ్చు.