Begin typing your search above and press return to search.

తాజా తెలుగోళ్ల హత్యల వెనుక అక్రమసంబంధం’?

By:  Tupaki Desk   |   24 March 2017 10:08 PM IST
తాజా తెలుగోళ్ల హత్యల వెనుక అక్రమసంబంధం’?
X
యూఎస్ లో హత్యకు గురైన తల్లీకొడుకుల ఉదంతంపై ఇప్పుడు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హత్యకు గురైన తనకుమార్తెను అల్లుడే హతమార్చి ఉంటారని తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. తమ అల్లుడికి అక్రమ సంబంధం ఉందని.. ఈ కారణంతోనే తమ కుమార్తెను.. మనమడ్ని చంపేసి ఉండొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూజెర్సీలోని బర్లింగ్టన్ లో నివాసం ఉంటుందన్న 40 ఏళ్ల శశికళను.. ఆమె కుమారుడు ఏడేళ్ల అనీష్ సాయి హత్యకు గురి కావటం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని గొంతు కోసిన వైనాన్ని.. ఆమె భర్త హనుమంతరావు పోలీసులకు చెప్పటం తెలిసిందే.

తీవ్ర సంచలనం రేపిన ఈ ఉదంతంపై బాధితురాలి తల్లిదండ్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న నర్రాహనుమంతరావు గడిచిన 12 ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. హతురాలు సైతం జాబ్ చేస్తున్నారు.కొద్దిరోజులుగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ తో పని చేస్తున్న ఆమె.. హత్యకు గురైన రోజు సాయంత్రం స్కూల్ కు వెళ్లి తన కుమారుడ్ని ఇంటికి తీసుకొచ్చారు.సాయంత్రం ఏడు గంటల వేళలో.. తన భార్య.. కుమారుడ్ని ఎవరో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లటంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే శశికళ తల్లిదండ్రులు విజయవాడలో ఉంటున్నారు. తమ కుమార్తెను.. మనమడ్ని ఎవరో హత్య చేసినట్లుగా చెబుతున్నతమ అల్లుడి కథనం ఉత్త కట్టుకథేనని.. ఒక మహిళతో అతనికిఅక్రమ సంబంధం ఉందని.. ఈ కారణంతోనే తమ కూతుర్నిచంపి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. తాజా ఆరోపణలతోఈ ఉదంతం ఒక్కసారి కొత్త మలుపు తిరిగినట్లైంది. అమెరికా పోలీసులు వివరాలు వెల్లడిస్తే కానీ.. ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చేలా కనిపించట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/