Begin typing your search above and press return to search.
ఉత్తరాది.. దక్షిణాది అనే పవన్ వ్యూహమిదేనా?
By: Tupaki Desk | 8 April 2017 11:55 AM ISTకలపటానికి కష్టపడాలి కానీ.. విడగొట్టటానికి పెద్ద కష్టం అక్కర్లేదు. సూటిగా తగిలే నాలుగు మాటలు అంటే చాలు.. ఆ మాటలు పుట్టించే మంటలు అంతా ఇంతా కాదు. ఇలాంటి మాటలతో ఇప్పటికే చాలానే ఇష్యూలు జరిగాయి. దీని కారణంగా జరిగిందేమంటే.. మంట పుట్టించే నాయకులు బాగానే ఉన్నా.. వారి మాటల్ని విని రెచ్చిపోయే వారికి.. వారి కుటుంబాలకే నష్టమంతా. ఉన్నట్లుండి ఇప్పుడీ మాటలన్నీ ఎందుకంటే.. పవర్ స్టార్ గా చిత్రసీమకు పరిచయమై.. జనసేన అధినేతగా రాజకీయ రంగంలో తన సొంత మార్క్ వేయాలని తపిస్తున్న పవన్ కల్యాణ్.. తరచూ ఉత్తరాది.. దక్షిణాది మాటల్ని ప్రస్తావిస్తుంటారు.
ఇప్పటివరకూ దేశంలో చాలామంది నేతలు వేర్వేరుప్రాంతాల్నివేర్వేరుదేశాలుగా విడిపోవాలని వినటం చూశాం. కానీ.. పవన్ స్టైల్ కాస్త భిన్నం. ఒకదిశగా ఉన్న ప్రాంతాలన్నీ కలిసి ఒకే దేశంగా ఏర్పడితే అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. గతంలో పంజాబీయులు ఖలిస్థాన్ అనీ.. కశ్మీరీలు తాము సొంతదేశంగా ఏర్పడాలన్న వాదనతో పాటు.. తమిళులు తమకోప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ డిమాండ్లు వినిపించటం తెలిసిందే.
కానీ.. వీరంతా ఒక దిక్కున ఉండే రాష్ట్రాలన్నీ కలిసి ఒక దేశంగా అనే కాన్సెప్ట్‌ను వినిపించలేదు. ఆ లోటును తీరుస్తూ.. పవన్ ఈ మధ్యన తరచూ ఉత్తరాది.. దక్షిణాది అంటూ దిక్కుల పేరిట దిక్కుమాలిన రాజకీయాన్ని షురూ చేశారు. ఇలాంటి చిత్రపు ఆలోచనలకు బలాన్ని చేకూర్చేలా.. బుద్దిలేని మోడీ పరివారం ఎప్పటికప్పుడు చేసే తప్పులు.. పవన్ చేత ఈ తరహా మాటల్ని పదే పదే పలికించేలా చేస్తున్నాయి.
తాజాగా ఒక బుద్ధిలేని బీజేపీ మాజీ ఎంపీ ఒకరు.. దక్షిణాది వారంతా నలుపు అన్న మాటను అనేయటం.. ఆ మాటను పట్టుకొని ఉత్తరాది అహంకారం అంటూ ట్వీట్స్ తో చెలరేగిపోయారు.
దక్షిణాది నుంచి వచ్చే ఆదాయం కావాలే కానీ.. వారు అక్కర్లేదా? అన్న ప్రశ్నతో పాటు.. నలుపు అంటూ అవమానిస్తారా? అంటూ తెగ ఫైర్ అయిపోయారు. ఈ చిన్న విషయానికే దక్షిణాది రాష్టాలన్నీ కలిసే మ్యాప్ ను కట్ చేసి తన ట్వీట్ కు అతికించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు.. దేశం నుంచి విడిపోయే భారీ కామెంట్లను చూస్తే.. పవన్ రాజకీయ పరిణితిపై సందేహాలువ్యక్తం కావటం ఖాయం.
తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో చాలారాత్రిళ్లు తాను నిద్రపోలేదని.. తన గుండెను ఎంతగానో కలిచివేసిందని చెప్పుకొచ్చారు. ఒకే భాషను మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతేనే అంత బాధపడిన పవన్ కల్యాణ్.. వేర్వేరు భాషలు.. ఆచారాలు.. ప్రాంతాలు వేరైన దక్షిణాది వారంతా కలిసి ఒక దేశంగా ఏర్పడాలనే విషయాన్ని తన తాజా ట్వీట్ తో చెప్పకనే చెప్పేసిన పవన్ తీరు చూస్తే.. విద్వేషపు రాజకీయాలకు తెర తీస్తున్నారా? అన్న భావన కలగటం ఖాయం. ఈ తరహా రాజకీయాల వల్ల జరిగే నష్టం ఏమిటంటే.. అమాయకులు.. తొందరపాటు తనాన్ని ఆభరణంగా ఫీలయ్యే వారంతా రెచ్చిపోయే ప్రమాదం ఉంది.
రాజకీయ నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వేళలో.. అందుకు భిన్నంగా ఉత్తరాది.. దక్షిణాది అంటూ పవన్ మాట్లాడుతున్న మాటల కారణంగా ఎగిసిపడే ఆగ్రహ జ్వాలలతో ఉత్తరాది.. దక్షిణాది ప్రజలు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తున్నారన్న విమర్శ ఉంది. ఇప్పటివరకూ ఉత్తరాది.. దక్షిణాది ప్రజల మధ్య ఎలాంటి విబేదాలులేవు. కానీ.. ఈ తరహా వాదనను తరచూ వినిపించటం ద్వారా.. పవన్ రెండు ప్రాంతాల ప్రజల మధ్య లేనిపోని దూరాన్నిపెంచే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ తెగ కబుర్లు చెప్పే పెద్దమనిషి చంద్రబాబు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఫిరాయింపుల వేటుపడే వీలున్న ఎమ్మెల్యేల్నినిబంధనలకు విరుద్ధంగా మంత్రుల్ని చేసేస్తే.. మాట వరసకు ఖండించని పవన్.. ఎవడో ఊరు..పేరూలేని మాజీ ఎంపీ ఒకరు నోటి తుత్తరతో మాట అంటే.. దానికి తెగ ఫీల్ కావటమే కాదు.. ప్రాంతాల వారీగా దేశం విడిపోవాలన్న బావజాలాన్ని వినిపించటం పవన్ కు సరికాదన్న మాటను పలువురు చెబుతున్నారు. మరీ.. విషయంలో పవన్ కాస్త ఆలోచిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/